ప‌వ‌న్ క‌ళ్యాన్ ఎవ‌రు..నాకు తెలియ‌దు: చిరంజీవి నాకు తెలుసు : అశోక్ గ‌జ‌ప‌తి రాజు హాట్ కామెంట్స్‌..!

కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌పతి రాజు మ‌రోసారి ప‌వన్ పై హాట్ కామెంట్లు చేసారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ ఎవ‌రో త‌న‌కు తెలియ‌ద‌ని మ‌రో సారి స్ప‌ష్టం చ‌యేసారు. గ‌తంలో ఇదే ర‌క‌మైన కామెంట్లు చేయ‌గా...వ‌ప‌న్ సైతం సీరియ‌స్ గా స్పందించారు. టిడిపి గెల‌వ‌టానికి స‌హ‌క‌రించిన ప‌వ‌న్ తెలియ‌ద‌ని చెప్ప‌టం పై ఆప్ప‌ట్లో ప‌వ‌న్ అభిమా నులు ఆగ్ర హం వ్య‌క్తం చేసారు.

చిరంజీవి తెలుసు..ప‌వ‌న్ తెలియ‌దు..

చిరంజీవి తెలుసు..ప‌వ‌న్ తెలియ‌దు..

గతంలో ప‌వ‌న్ పై చేసిన కామెంట్ల తో ఇరుకున ప‌డిన అశోక్ గ‌జ‌ప‌తి రాజు మ‌రోసారి అదే ర‌కంగా కామెంట్లు చేసారు. ప‌వ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన త‌రువాత‌..స‌మ‌స్య సమిసి పోతున్న త‌రుణంలో తాజాగా మ‌రోసారి మాజీ కేంద్ర మంత్రి అదే ర‌కంగా మాట్లాడారు. తాను సినిమాలు చూడ‌న‌ని..ప‌వ‌న్ క‌ళ్యాన్ అన్న‌య్య చిరంజీవి తెలుస‌ని చెప్పుకొచ్చారు.

అశోక్ గ‌జ‌ప‌తి

అశోక్ గ‌జ‌ప‌తి

ప‌వ‌న్ క‌ళ్యాన్ వాళ్ల నాన్న కూడా త‌న‌కు తెలుస‌ని పేర్కొన్నారు. ఎక్సైజ్ శాఖ‌లో ప‌ని చేస్తున్నప్పుడు ప‌వ‌న్ తండ్రి ఒక ప‌ని కోసం త‌న ద‌గ్గ‌రికి వ‌స్తే చేపిపెట్టాన‌ని అశోక్ గ‌జ‌ప‌తి వివ‌రించారు. గ‌తంలో అశోక్ చేసిన వ్యాఖ్య‌ల పై ప‌వ‌న్ తో స‌హా.. కార్య‌క‌ర్త‌లు..అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. తాజాగా, ముఖ్య‌మంత్రి సైతం ప‌వ‌న్ పై విమ‌ర్శ‌ల‌ను ప‌క్క‌న పెట్టారు. గ‌తం కంటే భిన్నంగా టిడిపి అధినేత ప‌వ‌న్ విష‌యంలో మ‌చ్చిక చేసుకొనే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కానీ, ఇప్పుడు ఎంపి అశోక్ చేసిన వ్యాఖ్య‌లు తిరిగి ప‌వ‌న్ అభిమానుల‌కు ఆగ్ర‌హం తెప్పించే విధంగా ఉన్నాయి.

 ప‌వ‌న్ ను రాజ‌కీయ నేత‌గా గుర్తించటం లేద‌ని చెప్ప‌ట‌మేనా..

ప‌వ‌న్ ను రాజ‌కీయ నేత‌గా గుర్తించటం లేద‌ని చెప్ప‌ట‌మేనా..

మాజీ కేంద్ర మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు వ్యాఖ్య‌ల వెనుక ప‌ర‌మార్ధం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. తాను సినిమాలు చూడ‌న ని చెప్ప‌టం ద్వారా..ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినీ హీరో గా మాత్ర‌మే చూస్తున్న‌ట్లు ప‌రోక్షంగా చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ ర‌కంగా వ్యాఖ్యానించ‌టం ద్వారా ప‌వ‌న్ రాజ‌కీయ పార్టీ అధినేత‌గా ప్ర‌స్తావించ‌లేదు. దీంతో..ఇప్పుడు జ‌గ‌న్ ఈ ర‌క‌మైన టిడిపి నేత‌ల వైఖ‌రి పై ప‌వ‌న్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+