బెజవాడ గాంధీనగర్‌లో అగ్నిప్రమాదం, అగ్నికి ఆహుతైన వస్త్ర దుకాణాలు..
విజయవాడలో అగ్నిప్రమాదం జరిగింది. గాంధీనగర్ దత్త కాంప్లెక్స్‌లో మంటలు చెలరేగాయి. దీంతో అక్కడున్న వారు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. కాంప్లెక్స్‌లో మొత్తం వస్త్ర దుకాణాలు ఉండటంతో... స్థానికులు ఆందళన చెందారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది చేరుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

గాంధీనగర్‌లో రాజ్ యువరాజ్ వద్ద దత్త కాంప్లెక్స్ ఉంది. ఇందులో అన్ని వస్త్ర దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడూ రద్దీగా ఉంటోంది. అయితే శుక్రవారం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో హై టెన్షన్ నెలకొంది. మంటల ధాటికి రెండు వస్త్ర దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. మరికొన్ని వస్త్ర దుకాణాలకు వ్యాపించే లోపు మంటలను ఆర్పివేశారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై స్పష్టత రాలేదు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా..? లేదా ఇతర కారణం తెలియాల్సి ఉంది. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఆస్తి నష్టాన్ని అధికారులు అంచనా వేసి.. ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.
-
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే!












Click it and Unblock the Notifications