గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి.. ప్రకాశం బ్యారేజీలో యువకుడు.. చివరకు సేఫ్‌గా..!
విజయవాడ : గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఓ యువకుడు ప్రకాశం బ్యారేజీలో పడటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. చివరకు అతడిని రక్షించి క్షేమంగా బయటకు తీసుకురావడంతో అక్కడున్నవారు ఊపిరి పీల్చుకున్నారు. కళ్ల ముందే సదరు యువకుడు ప్రకాశం బ్యారేజీలో కొట్టుకు పోతుంటే చూడలేకపోయామని.. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం అలర్ట్ కావడంతో అతడు ప్రాణాలతో బయట పడ్డాడని చెబుతున్నారు.
విజయవాడలో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ప్రకాశం బ్యారేజీ సమీపంలోని సీతమ్మ వారి పాదాల ఘాట్ దగ్గర కోలాహలం ఏర్పడింది. వినాయక నిమజ్జన పర్వం కనులారా తిలకించడానికి సందర్శకులు పోటెత్తుతున్నారు. అయితే ఇటీవల ఎగువన కురిసిన వర్షాలకు ప్రకాశం బ్యారేజీ జల కళ సంతరించుకుంది. నీటి ప్రవాహం బాగా ఉండటంతో సందర్శకులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తూనే ఉన్నారు.

అయితే గణేశ్ నిమజ్జనం తిలకించడానికి అక్కడకు వచ్చిన ఓ యువకుడు ప్రకాశం బ్యారేజీలో పడిపోయాడు. వరద నీటి ప్రవాహానికి చాలా దూరం కొట్టుకు పోయాడు. అయితే నిమజ్జనం సందర్భంగా ప్రకాశం బ్యారేజీ దగ్గర ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం సేవలందిస్తోంది. సదరు యువకుడు నీటిలో పడగానే వారు వెంటనే అలర్టయ్యారు.
వరద నీటి ప్రవాహంలో కొట్టుకు పోతున్న సదరు యువకుడిని ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం క్షేమంగా ఒడ్డుకు చేర్చింది. అతడు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పి.సుధాకర్ గా గుర్తించారు. అయితే ప్రాణాలకు తెగించి ఆ యువకుడిని కాపాడిన తీరుపై ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం పట్ల స్థానికులు ప్రశంసలు కురిపించారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications