85 శాతం జ‌గ‌న్ హామీల‌కు కేటాయింపులు: కాపు సంక్షేమానికి రెండు వేల కోట్లు: శాఖ‌ల వారీగా నిధులు ఇలా..!

Recommended Video

    Ap Budget 2019 : జ‌గ‌న్ అధికారంలోకి రాక మందు ఇచ్చిన ప్ర‌తీ హామీకి బ‌డ్జెట్‌ కేటాయింపు || Oneindia

    ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అధికారంలోకి రాక మందు ఇచ్చిన ప్ర‌తీ హామీని..ప్ర‌తీ మాటకు ఇప్పుడు బ‌డ్జెట్‌లో కేటాయింపులు జ‌రిగాయి. దీని ద్వారా త‌న విశ్వ‌స‌నీయ‌త మ‌రింత‌గా పెంచుకొనేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నించారు. రంగాల వారీగా.. సంక్షేమం దిశ‌గా..వ్య‌వ‌సాయం..విద్య‌కు ప్రాధాన్య‌త ఇస్తూ బ‌డ్జెట్‌లో కేటాయింపులు జ‌రిగాయి. మొత్తం రూ. 2లక్షల 27 వేల 974 కోట్లు బ‌డ్జెట్ ఖ‌ర్చుగా చూపించ‌గా..అందులో రెవిన్యూ లోటు రూ, 1,778052 కోట్లుగా అంచ‌నా వేసారు. ఇక‌, బ‌డ్జెట్ అంచ‌నా లో 19.32 శాతం పెరుగుద‌లగా ప్ర‌తిపాదించారు. ఇక‌, కీల‌క రంగాల‌కు ఏ ర‌కంగా కేటాయింపులు చేసిందీ బ‌డ్జెట్ ప్ర‌సంగంలో ఆర్దిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాద్ వివ‌రించారు.

    రాజ‌ధాని కోసం కేవ‌లం రూ. 500కోట్లు మాత్ర‌మే..

    రాజ‌ధాని కోసం కేవ‌లం రూ. 500కోట్లు మాత్ర‌మే..

    ఏపీ ప్ర‌భుత్వం బ‌డ్జెట్‌లో కీల‌క‌మైన అమ‌రావ‌తి నిర్మాణం కోసం కేవ‌లం రూ.500 కోట్లు మాత్ర‌మే ప్ర‌తిపాదించింది. దీని ద్వారా తాము రాజ‌ధాని త‌ర‌లిస్తున్నామ‌నే ప్ర‌చారానికి తెర దించారు. అదే విధంగా అమ‌రావ‌తి ఇప్పుడు ప్రాధాన్య‌త అంశం కాద‌నే విష‌యాన్ని స్ప‌ష్టం చేసింది. ఇక రంగాల వారీగా ప‌రిశీలిస్తే.. విద్యుత్‌ కొనుగోళ్లు ఒప్పందం కోసం అద నంగా రూ.2 వేల కోట్లు చెల్లిస్తోంది. ఇంధన రంగంలో గత ప్రభుత్వం నుంచి రూ.20 వేల కోట్లు రుణంగా వచ్చింది
    సాగునీటి శాఖకు 13,139 కోట్లు ప్ర‌తిపాదించ‌గా.. వైఎస్‌ఆర్‌ రైతు భరోసాకు 8750 కోట్లు..గ‌తంలో తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు అగ్రిగోల్డ్‌ బాధితులకు 1150 కోట్లు కేటాయించారు. ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీ మేర‌కు ఆటోలు, ట్యాక్సీ డ్రైవర్ల సంక్షేమానికి రూ.400 కోట్లు ప్ర‌తిపాదించ‌గా..వైఎస్‌ఆర్‌ 9గంటల ఉచిత విద్యుత్‌కు 4525 కోట్లు కేటాయించారు.
    అదే విధంగా రైతు సంక్షేమంలో భాగంగా..ధరల స్థిరీకరణ నిధికి రూ.3వేల కోట్లు..విపత్తుల నిర్వహణకు రూ.2,002 కోట్లు
    ఫసల్‌ బీయా యోజనకు రూ.1163 కోట్లు కేటాయిస్తూ బడ్జెట్‌లో ప్ర‌తిపాదించారు.

    అమ్మ ఒడి ప‌ధ‌కానికి రూ. 6455 కోట్లు..

    అమ్మ ఒడి ప‌ధ‌కానికి రూ. 6455 కోట్లు..

    జ‌గ‌న్ పేరుతో అమ్మ ఒడి ప‌ధ‌కాన్ని వ‌చ్చే జ‌న‌వ‌రి 26వ తేదీ నుండి ప్రారంభిస్తున్న‌ట్లు స‌భ్యుల హర్ష ధ్వానాల మ‌ధ్య ఆర్దిక మంత్రి ప్ర‌క‌టించారు. ఆక్వా రైతుల విద్యుత్‌ సబ్సిడీ రూ.475 కోట్లు..వైఎస్‌ బోర్‌ వెల్‌పథకానికి రూ.200 కోట్లు..
    విత్తనాల సరఫరాకు రూ.200 కోట్లు..అమ్మ ఒడి పథకానికి రూ.6455 కోట్లు కేటాయించారు. ఇక‌, వైద్య రంగంలో ఆరోగ్యశ్రీ రూ.1740 కోట్లు..ఆస్పత్రుల్లో మౌలికవసతులకు రూ.1500 కోట్లు ప్ర‌తిపాదించారు. తాజాగా తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు
    ఆశావర్కర్ల గౌరవవేతనం 456 కోట్లు కేటాయించారు. వైఎస్‌ఆర్‌ గృహ వసతికి రూ 5వేల కోట్లు..పట్టణాల్లో ప్రధాని ఆవాస్‌ యోజనకు రూ.1370 కోట్లు..బలహీనవర్గాల ఇళ్లకు రూ.1280 కోట్లు..వైఎస్‌ఆర్‌ అర్భన్‌ హౌసింగ్‌కు వెయ్యి కోట్లు..వైఎస్సార్‌ కళ్యాణ కానుకకు రూ.300 కోట్లు..వైద్యరంగానికి రూ. 11,399 కోట్లు..నీటి సరఫరా, పారిశుద్ధ్యానికి రూ.2,234 కోట్లు.. గృహని ర్మాణ శాఖకు రూ.3,617 కోట్లు..అర్బన్‌ డెవలప్‌మెంట్‌కు రూ. 6,587 కోట్లు కేటాయించారు.

     కాపు కార్పోరేష‌న్‌కు రెండు వేల కోట్లు..

    కాపు కార్పోరేష‌న్‌కు రెండు వేల కోట్లు..

    జ‌గ‌న్ త‌న పాదయాత్ర‌లో కాపు సంక్షేమం కోసం ప్ర‌స్తుతం ఇస్తున్న నిధుల‌కు రెట్టింపు ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. దీని మేర‌కు ఈ బ‌డ్జెట్‌లో కాపు కార్పొరేషన్‌కు రూ.2 వేల కోట్లు గా ప్ర‌తిపాదించారు. ఆర్టీసీకి రూ.వెయ్యి కోట్లు..ఆర్టీసీ ద్వారా ఇస్తోన్న రాయితీలకు రూ.500 కోట్లు..వ్యవసాయానికి రూ.20,677 కోట్లు..గ్రామీణాభివృద్ధికి రూ.29,329 కోట్లు..విద్యుత్‌- రూ.6,861 కోట్లు.. రవాణా- రూ.6,157 కోట్లు..ఇండస్ట్రీ మినరల్స్‌కు రూ.3,986 కోట్లు..జనరల్‌ ఎకో సర్వీసెస్‌ రూ.6,025 కోట్లు
    సాధారణ విద్య- రూ. 32,618 కోట్లు..వైద్యరంగానికి రూ. 11,399 కోట్లు..నీటి సరఫరా, పారిశుద్ధ్యానికి రూ.2,234 కోట్లు..
    గృహ నిర్మాణశాఖకు రూ.3,617 కోట్లు..సంక్షేమశాఖలకు రూ.14,142 కోట్లు..సాధారణ సర్వీసులకు రూ.66,324 కోట్లు..
    హోంశాఖ రూ. 7,461.92 కోట్లు..మైనార్టీ సంక్షేమానికి రూ. 952 కోట్లు..ఎస్టీ సబ్‌ప్లాన్‌ కంపోనెంట్‌ కింద రూ.4,988 కోట్లు
    ఎస్సీ సబ్‌ప్లాన్‌ కంపోనెంట్‌ కింద రూ. 15 వేల కోట్లు..బీసీ సబ్‌ప్లాన్‌ కంపోనెంట్‌ కింద రూ. 15,061 కోట్లు..నాయి బ్రాహ్మ ణులు, రజకులు, టైలర్లకు రూ.300 కోట్లు..బ్రాహ్మ‌ణ సంక్షేమం కోసం వంద కోట్లు కేటాయించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+