మంగళగిరి ఎయిమ్స్‌కు నీటి సరఫరా కూడా లేదు, సర్కార్‌పై చంద్రబాబు ఫైర్
సీఎం జగన్‌పై ప్రతిపక్ష నేత చంద్రబాబు ఫైరయ్యారు. ఈ మూడున్నరేళ్లలో ఆయన ఏం చేశారని అడిగారు. మంగళగిరి ఎయిమ్స్‌కు నీటి సరఫరా చేయలేదని ఫైరయ్యారు. దీనిని బట్టి ఏమనుకోవాలని కోరారు. తక్కువ ధరలో పేదలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించే ఆసుపత్రికి నీళ్లివ్వలేనందుకు ప్రభుత్వం సిగ్గుపడాలని మండిపడ్డారు.
మూడున్నరేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎయిమ్స్ కోసం ఏంచేసిందో చెప్పగలదా? అని అడిగారు. ఆనాడు టీడీపీ హయాంలో ఎయిమ్స్‌కు భూములు కేటాయించామని గుర్తుచేశారు. అక్కడ వసతులు కల్పించి, వైద్య సేవల కోసం సంస్థను సిద్ధం చేశామని వెల్లడించారు. పెరిగిన అవసరాలకు అనుగుణంగా నీటి వనరులు సమకూర్చాలని లేఖ రాసినా పరిష్కరించలేదని గుర్తుచేశారు.

రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు అన్నీ తామే తెచ్చామని అసెంబ్లీలో అసత్యాలు చెప్పుకున్నారని ఫైరయ్యారు. తాను ఉంటున్న మున్సిపాలిటీ నుంచి ఆసుపత్రికి నీళ్లెందుకు ఇవ్వలేకపోతున్నారని నిలదీశారు. కేంద్రమంత్రులు కూడా నీటి వసతిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినా.. స్పందించలేదని పేర్కొన్నారు.
మంగళగిరి ఎయిమ్స్ కు అన్ని అదనపు మౌలిక సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు డిమాండ్ చేశారు. వేలాది మంది రోగుల కోసం వసతులు కల్పించాల్సిందేనని స్పష్టంచేశారు.












Click it and Unblock the Notifications