• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

బాబు భారీ ఆఫర్, కొత్త విషయం చెప్పిన పవన్ కళ్యాణ్! కుండబద్దలు.. పార్టీల్లో కలకలం

|

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ టీడీపీ, వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై వాగ్భాణాలు విసురుతున్నారు. 2014లో టీడీపీ, బీజేపీలకు మద్దతు పలికిన పవన్ ఆ తర్వాత ఓ విధంగా సామ, బేధ, దాన, దండోపాయలను ప్రయోగించినట్లుగా ఉంది. ఎన్నికలకు ముందు చివరి అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు.

మొదటి నాలుగేళ్లు సమస్యల విషయంలో చంద్రబాబును కలవడం, విజ్ఞప్తులు చేయడం, ప్రత్యేక హోదా కోసం బీజేపీపై విమర్శలు, ఆ తర్వాత టీడీపీ పైనా వాగ్భాణాలు ఎక్కుపెట్టారు. ఎన్నికలకు ముందు పవన్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

నిన్న అమిత్ షా, నేడు చంద్రబాబు

నిన్న అమిత్ షా, నేడు చంద్రబాబు

నాడు బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా పైన, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పైన 'ఆఫర్' విమర్శలు గుప్పించారు. జనసేన పార్టీని బీజేపీలో కలపాలని, రాజ్యసభ సీటు ఇస్తానని అమిత్ షా తనకు ఆఫర్ ఇచ్చారని, కానీ తాను తిరస్కరించానని జనసేనాని పలుర్లు వెల్లడించారు. తాజగా, తెలుగుదేశం పార్టీ కూడా తనకు అలాంటి ఆఫర్ ఇచ్చినట్లు వెల్లడించారు. తాను కోరుకుంటే సినిమాల్లో కోట్లు సంపాదించగలనని, వాటిని వదిలి పెట్టి రాజకీయాల్లోకి వచ్చానని, తాను మద్దతిస్తానని చెబితే ఏ పార్టీ అయినా తన వద్దకు పదవులు వస్తాయని, కానీ తాను పదవుల కోసం పార్టీని స్థాపించలేదని పలుమార్లు చెప్పారు.

వైయస్ విషయంలో.. జగన్‌కే తెలియని విషయం చెప్పిన ఆదినారాయణ రెడ్డి! ఆ తర్వాతే వైసీపీ నుంచి జంప్

పొత్తుపై తేల్చేసి, ఆఫర్‌పై కొత్త విషయం చెప్పిన పవన్

పొత్తుపై తేల్చేసి, ఆఫర్‌పై కొత్త విషయం చెప్పిన పవన్

తాజాగా, టీడీపీ, జనసేన పొత్తుపై టీజీ వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు పొత్తు విషయంలో ప్రజల్లో గందరగోళం కనిపిస్తే పార్టీకి నష్టం జరుగుతుందని భావించిన జనసేనాని తీవ్రంగానే స్పందించారు. తద్వారా అసలు టీడీపీతో పొత్తు ఊసే లేదని తేల్చి చెప్పారు. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లకుండా, జనసేన.. టీడీపీతో కలవదని ప్రజల్లోకి వెళ్లేలా చేశారు. మొన్న అమిత్ షా, నేడు తెలుగుదేశం పార్టీ తనకు రాజ్యసభ ఆఫర్ ఇచ్చాయని పవన్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. మేం వదిలేసిన, మాకు వద్దనుకున్న రాజ్యసభ సీటును టీజీ వెంకటేష్ తీసుకున్నారని వ్యాఖ్యానించారు. అంటే చంద్రబాబు కూడా జనసేనానికి అమిత్ షా దారిలోనే రాజ్యసభ సీటు ఆఫర్ చేశారని అర్థమవుతోంది.

ఆ సీటుకు నో చెబితేనే

ఆ సీటుకు నో చెబితేనే

అప్పుడు రాజ్యసభకు ముగ్గుర్ని నామినేట్ చేసే అవకాశం రాగా, సుజనా చౌదరికి రెండోసారి పొడిగించారు. మిత్రపక్షమైన బీజేపీకి రెండోసీటు ఇచ్చారు. సురేష్ ప్రభు రాజ్యసభకు వెళ్లారు. మూడో సీటును టీజీ వెంకటేష్‌కు ఇచ్చారు. ఆ సమయంలోనే జనసేనానికి చంద్రబాబు నాయుడు ఆఫర్ చేసి ఉంటారని ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. సుజనాకు ఎలాగు రెండోసారి పొడిగించాల్సిన పరిస్థితి. నాడు బీజేపీ మిత్రపక్షం కాబట్టి సురేష్ ప్రభుకు నో చెప్పలేని స్థితి. ఈ నేపథ్యంలో జనసేనాని ఆఫర్‌కు నో చెప్తేనే టీజీకి వెళ్లినట్లుగా భావిస్తున్నారు. అయితే ఈ విషయం పవన్ చెప్పే వరకు బయటకు రాలేదు. 2019 ఎన్నికల కోసం ఆలోచించే టీడీపీ జనసేనానికి ఆఫర్ చేసి ఉంటుందని చెబుతున్నారు. కానీ ఆయన నో చెప్పారు.

జగన్ విషయంలోను కుండబద్దలు!

జగన్ విషయంలోను కుండబద్దలు!

కొద్ది రోజుల క్రితం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయంలోను పవన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెరాస ద్వారా పొత్తు కోసం వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. ఇవి కూడా రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. దీనిపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే వైసీపీ, తెరాస మధ్య దోస్తీ ఉందని అలాంటి ప్రయత్నాలు చేసి ఉండవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి పవన్ కళ్యాణ్ కుండబద్దలు కొడుతున్నారని, తద్వారా ఇతర పార్టీలను కార్నర్ చేస్తున్నారని అంటున్నారు. అమిత్ షా ఆఫర్, చంద్రబాబు ఆఫర్, వైసీపీ ప్రయత్నాల కామెంట్లు ఆయా పార్టీల్లో, రాజకీయ కలకలం సృష్టించాయి, సృష్టిస్తున్నాయి.

English summary
Janasena chief Pawan Kalyan on Wednesday indirectly said Telugudesam Party chief Nara Chandrababu Naidu offered Rajy Sabha seat to Janasenani.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X