Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబు సభలో జూ ఎన్టీఆర్ మేనియా - తారకరత్న ఫొటోలతో..!!

టీటీడీపీ అధినేత చంద్రబాబు కు మరోసారి జూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ షాక్ ఇచ్చారు. పార్టీకి కీలకంగా భావిస్తున్న కృష్ణా జిల్లాలో చంద్రబాబు మూడు రోజుల పర్యటన ప్రారంభమైంది. చంద్రబాబు భారీ ర్యాలీగా వెళ్తున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్, నందమూరి హరికృష్ణ, నందమూరి తారకరత్న ఫోటోలతో అభిమానులు హల్ చల్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికల్లో టీడీపీకి ప్రచారం చేసిన ఫొటోలు.. ఆస్కార్ అవార్డు ల్లో పాల్గొన్న సమయంలో తారక్ ఉన్న ఫొటోలను ప్రదర్శించారు. ఎన్టీఆర్ సీఎం అంటూ నినాదాలు చేసారు.

మరోసారి జూ ఎన్టీఆర్ ఫొటోలు:చంద్రబాబు పర్యటనలో మరోసారి జూ ఎన్టీఆర్ ఫొటోలు కనిపించాయి. గతంలో చంద్రబాబు కుప్పం, మచిలీపట్నంలో పర్యటించిన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కు మద్దతుగా ఫ్యాన్స్ జెండాలు ప్రదర్శించ టంతో పాటుగా అనుకూల నినాదాలు చేసారు. కుప్పంలో జరిగిన సభలో పార్టీలో తారక్ కు మళ్లీ తగిన ప్రాధాన్యత ఇవ్వాలని నినదించారు. చంద్రబాబు మాత్రం స్పందించలేదు. కొద్ది రోజుల క్రితం తిరుపతి కేంద్రంగా నారా లోకేష్ తన యువగళం యాత్రలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ తిరిగి రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. ఇక, ఇప్పుడు ఎన్నికలకు సిద్దం అవుతన్న వేళ...అటు పవన్ కల్యాణ్ తో పొత్తు ఖాయంగా కనిపిస్తున్న సమయంలో కీలకమైన క్రిష్ణా జిల్లాలో చంద్రబాబు పర్యటనలో మరోసారి తారక్ అభిమానులు హల్ చల్ చేశారు.

Fans Slogans in Chandra Babu Machilipatnam Meeting

ఎన్టీఆర్ సీఎం నినాదాలు:ఈ సారి కేవలం తారక్ ఫొటోలకే పరిమితం కాలేదు. నందమూరి హరికృష్ణ, తారక రత్న ఫొటోలను కూడా ప్రదర్శించారు. ఎన్టీఆర్ సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. విజయవాడ నుంచి భారీ ర్యాలీగా చంద్రబాబు వెళ్తున్న సమయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ ఫ్లెక్సీలతో నినాదాలు చేసారు. ఇక, చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా విమర్శలు చేసారు. బటన్ నొక్కే జగన్ ప్రజాధనం బొక్కారని ఆరోపించారు. జిల్లాలో రాబోయే ఎన్నికల్లో కుప్పంలో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పదేపదే చెబుతున్నారన్నారు. కుప్పంలో గెలవడం తర్వాత సంగతి. ముందు పులివెందులలో ఆయన ఓడిపోవడం, టిడిపి జెండా ఎగరడం ఖాయమని చెప్పుకొచ్చారు.

పులివెందులలోనూ గెలుస్తాం":వైసిపి ప్రభుత్వ పాలనలో సిఎం జగన్‌ రాష్ట్రాన్ని అధోగతి పాల్జేశారని విమర్శించారు. జగన్‌ పాలనపై ప్రజలు తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలే దీనికి రుజువని తెలిపారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఇంటి గోడలపై స్టిక్కర్లు అతికించాలన్నా, రాతలు రాయాలన్నా యజమాని అనుమతి తప్పనిసరిగా అన్నారు. జగన్‌ ఫొటోతో వలంటీర్లు అతికిస్తున్న స్టిక్కర్లకు ప్రజల అనుమతి తీసుకోలేదని విమర్శించారు. ఈ నాలుగేళ్లలో ప్రజలకు ఏ మంచి జరిగిందో జగన్‌ చెప్పాలని ప్రశ్నించారు. మహిళల జీవితాలు చితికిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.వైసిపి పాలన నుంచి విముక్తి కలిగినప్పుడే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు.వస్తాయన్నారు

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+