విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క‌రువు సీమ‌లో కార్ల త‌యారీ : కియో తొలి కారు ప్రారంభం..!

|
Google Oneindia TeluguNews

అనంత‌పురం అంటే కరువు గుర్తుకు వ‌చ్చేది. ఇప్పుడు అక్క‌డ కియో ఫ్యాక్టరీ ఏర్పాటు ద్వారా ప్ర‌త్యేక గుర్తింపు వ‌చ్చిం ది. అనంత‌లోని ఏర్పాటు చేసిన కియో ఫ్యాక్టరీలో త‌య‌రైన తొలి కారును ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్రారంభించారు. అనంతపురం జిల్లా త్వ‌ర‌లో ప‌రిశ్ర‌మ‌ల‌కు చిరునామా మారుతుంద‌ని ముఖ్య‌మంత్రి చెప్పుకొచ్చారు. కియో సంస్థ కు ఏపి ప్ర‌భుత్వం అందించిన స‌హ‌కారాన్ని వివ‌రించారు.

కియో మోటార్

కియో మోటార్

అనంత‌పురం లో ఏర్పాటైన కియో మోటార్ సంస్థ అక్క‌డ త‌యారు చేసిన తొలి కారును ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్రారంభించారు. పరిశ్రమలకు అనంతపురం కేరాఫ్‌ అడ్రస్‌ అవుతుందని, రాయలసీమకు అనేక పరిశ్రమలు వస్తు న్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

తొలి కారు ఆవిష్క‌ర‌ణ‌..

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో ఏపీ నెంబర్‌ వన్‌‌గా ఉందన్నారు. కియా మోటార్స్‌ ట్రయల్‌ ప్రొడక్షన్‌ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తక్కువ సమయంలో కియా కారు మార్కెట్ లో కి రావడం.. ఎంతో ఆనందంగా ఉందని సీఎం వ్యాఖ్యానించారు.
ఆరు నెలల్లో కియాకు నీరు అందించామని, కియా ఈ ప్రాంత రూపురేఖల్నే మార్చేసిందని చంద్రబాబు కొనియాడారు. దేశంలోనే రాయలసీమలో తక్కువ వర్షపాతం ఉందని..అటువంటి ప్రాంతానికి కృష్ణా నీరు ఇవ్వ‌గ‌లిగామ‌ని వివ‌రించారు.
త్వ‌ర‌లోనే రాయ‌ల‌సీమ ఆటో మొబైల్ హ‌బ్ గా త‌యారవుతుంద‌ని వెల్ల‌డించారు.

కియో - ఏపి మ‌ధ్య భ‌విష్య‌త్‌లోనూ స‌హ‌కారం

ఏపి లో రికార్డు స‌మ‌యంలో ఉత్ప‌త్తి ప్రారంభించిన కియో సంస్థ - ఏపి ప్ర‌భుత్వం మ‌ధ్య భ‌విష్య‌త్‌లోనూ ఇదే ర‌కంగా స‌హ‌కారం కొన‌సాగుతుంద‌ని చెప్పుకొచ్చారు. ఏపి ప్ర‌భుత్వం అందించిన స‌హ‌కారం చూసి కియా ప్రతినిధులు ఆశ్చర్య పోయారని చంద్రబాబు అన్నారు. ఆటోమొబైల్‌ హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌ తయారవుతోందన్నారు. రాష్ట్రానికి సుజుకి, అశోక్‌ లేలాండ్‌, అపోలో సంస్థలు వచ్చాయని.. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నామని చంద్ర బాబు వివ‌రించారు. కొరియా, ఏపీ ప్రజలు ప్రపంచంలో ఎక్కడైనా రాణిస్తారని చంద్రబాబు అన్నారు. భవిష్యత్‌లో రాయలసీమ.. రత్నాల సీమగా మారుతుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. కియ లాంటి పరిశ్రమలు ఇంకా రాష్ట్రానికి రావాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. తాము ఊహించ‌ని విధంగా స‌హ‌కారం అందించార‌ని కియో సంస్థ ప్ర‌తినిధులు ముఖ్య‌మంత్రిని అభినందించారు.

English summary
KIO started production in Anantapur plant. CM Chandra Babu launched First KIO car in Anantapur. He says in future anantapur will become auotmobile hub.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X