వైసిపి కి మరింత సినీ గ్లామ‌ర్‌: ఘ‌ట్ట‌మ‌నేని వెర్స‌స్ అక్కినేని : రాజ‌ధాని కేంద్రంగా..!

Recommended Video

    YCRCP Party Getting More Cine Glamour

    వైసిపి కి మరింత సినీ గ్లామ‌ర్ తోడు కానుంది. ఎన్నిక‌ల్లో వైసిపి నుండి పోటీ చేయ‌టానికి సినీ ప్ర‌ముఖులు ఆస‌క్తి చూపిస్తు న్న‌ట్లు తెలుస్తోంది. వీరికి సీట్లు కేటాయింపు పైనా ఒక స్ప‌ష్ట‌త వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. జ‌గ‌న్ పాద‌యాత్ర ముగిసిన త‌రు వాత వీరు అధికారికంగా పార్టీ ఎంట్రీ..సీట్ల ఖ‌రారు పూర్త‌వుతుంద‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం.

    పెరుగుతున్న సినీ గ్లామ‌ర్‌..

    పెరుగుతున్న సినీ గ్లామ‌ర్‌..

    వైసిపి లో ఇప్ప‌టికే సినీ న‌టి రోజా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక‌, సినీ న‌టులు విజ‌య్ చంద‌ర్‌, తాజాగా పృధ్వీ, భాను చంద‌ర్ లు వైసిపి అధినేత‌కు మ‌ద్ద‌తుగా ఉంటున్నారు. ఇక, సినీ హీరో కృష్ణ వైయ‌స్ పై అభిమానంతో ఉండే వారు. ఇక‌, మోహ‌న్ బాబు వైసిపి అంటే ఆస‌క్తి చూపిస్తున్నారు. ఆయ‌న ప‌లు మార్లు జ‌గ‌న్ ను క‌లిసారు. మోహ‌న్‌బాబు ఈ సారి వైసిపి నుండి ఎన్నిక‌ల బ‌రిలో ఉంటార‌నే ప్ర‌చార‌మూ జ‌రుగుతోంది. ఆయ‌న గ‌తంలో టిడిపి నుండి రాజ్య‌స‌భ స‌భ్యుడిగా వ్య‌వ‌హరించారు.

    మోహ‌న్ బాబు

    మోహ‌న్ బాబు

    ఈ సారి ఎన్నిక‌ల్లో వైసిపి నుండి రాజంపేట లోక్‌స‌భ అభ్య‌ర్ధిగా పోటీ చేయాల‌నే ఆస‌క్తి ఉన్న‌ప్ప‌టికీ అక్క‌డి నుండి సిట్టింగ్ ఎంపీగా ఉన్న మిధున్ రెడ్డి ప్ర‌త్యేక హోదా కోసం రాజీనామా చేసి ఉన్నారు. దీంతో..ఆయ‌న‌కు ఖ‌చ్చింగా ఈ సారి సీటు ఇవ్వాల్సిన ప‌రిస్థితి. దీంతో..నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి నుండి మోహ‌న్ బాబు పోటీకి దిగుతార‌నే వార్త వైసిపి వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, అక్క‌డి నుండి కొద్ది కాలం క్రితం వైసిపి లో చేరిన ఆనం రామనారాయ‌ణ రెడ్డి బ‌రిలోకి దిగే అవ‌కాశం ఉంది. మ‌రి..జ‌గ‌న్ స‌ర్దుబాటు చేస్తే మోహ‌న్‌బాబు అక్క‌డి నుండి బ‌రిలోకి దిగే అవ‌కాశం క‌నిపిస్తోంది..

    అక్కినేని కుటుంబం నుండి బ‌రిలోకి...

    అక్కినేని కుటుంబం నుండి బ‌రిలోకి...

    ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు అక్కినేని నాగార్జున సైతం జ‌గ‌న్ తో స‌ఖ్య‌త‌గా ఉంటున్నారు. జ‌గ‌న్ కు స‌న్నిహితుడైన నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్..అటు నాగార్జున‌కు అత్యంత స‌న్నిహితుడు. ఇప్పుడు అక్కినేని కుటుంబం నుండి వైసిపి లోకి ఎంట్రీ ఉంటుం దని తెలుస్తోంది. నాగార్జున స్వ‌యంగా వైసిపి నుండి ఎంపీగా పోటీ చేస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతున్నా...అక్కినేని స‌న్ని హితు లు మాత్రం నాగార్జున స్వ‌యంగా రంగంలోకి దిగే అవ‌కాశం లేద‌ని చెబుతున్నారు. దీంతో.. నాగార్జ‌న స‌తీమ‌ణి అమ‌ల ను రాజ‌ధాని ప్రాంతంలోని విజ‌య‌వాడ లేదా గుంటూరు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక చోట బ‌రిలోకి దిగ‌టం పై చ‌ర్చ‌లు సాగుతున్న‌ట్లు అత్యంత విశ్వ‌స‌నీయ స‌మాచారం.

    గ‌ల్లా జ‌య‌దేవ్

    గ‌ల్లా జ‌య‌దేవ్

    ప్ర‌స్తుతం గుంటూరు లో సూప‌ర్ స్టార్ కృష్ణ అల్లుడు గ‌ల్లా జ‌య‌దేవ్ టిడిపి నుండి ఎంపీగా ఉన్నారు. వైసిపి నుండి ఎంపీ అభ్య‌ర్ధులుగా గుంటూరు -విజ‌య‌వాడ‌- ఒంగోలు నుండి రెండు సీట్లు అక్క‌డ టిడిపికి అండ‌గా ఉండే ఎ ప్ర‌ధాన సామాజిక వ‌ర్గం చెందిన వారికే ఇవ్వాల‌ని జ‌గ‌న్ ఆలోచ న గా తెలుస్తోంది. ఇక‌, ఒంగోలు నుండి ప్ర‌స్తుతం జాతీయ పార్టీలో ఉన్న ఓ మాజీ కేంద్ర మంత్రి వైసిపి నుండి బ‌రిలోకి దిగే అవ‌కాశాలు ఉన్నాయి. దీంతో...గుంటూరు నుండి సైతం అక్కినేని కుటుంబానికి చెందిన అమ‌ల పోటీకి దిగే చాన్స్ బ‌లంగా క‌నిపిస్తోంది. జ‌గ‌న్ పాద‌యాత్ర ముగిసిన వెంట‌నే దీని పై అధికారికంగా నిర్ణ‌యం జ‌ర‌గ‌నుంది..

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+