పుట్టిన రోజు సందర్భంగా రైతులకు జగన్ గొప్ప బహుమతి ఇచ్చారన్న ఎంపీ కేశినేని నానీ

నేడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజున ఏపీ ప్రజలకు సీఎం జగన్ గొప్ప బహుమతి ఇచ్చాడని దానిని రాజధాని రైతులు మర్చిపోలేరని టీడీపీ ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. రాజధాని లేని రాష్ట్రం కోసం రైతులు ఎంతో త్యాగం చేశారన్న కేశినేని నాని, రాష్ట్ర రాజధాని కోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన 30 వేల మంది రైతులను గొప్ప బహుమతి ఇచ్చి గౌరవించారని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండొచ్చంటూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ చేసిన సంచలన ప్రకటనపై ఇప్పటికే అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన బాట పట్టారు. ఇక అంతే కాదు మొన్నటికి మొన్న ఐదు కోట్ల జనాభా ఉన్న ఏపీకి మూడు రాజధానులు అవసరం అయితే 20 కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ కు 12 రాజధానులు కావాలని ఎద్దేవా చేసిన కేశినేని నానీ నేడు మరోమారు స్పందించారు. కేశినేని నాని ఇక నేడు 30 కాకపోతే 300 పెట్టు.. ఇంకా కావాలంటే మూడు వేలు పెట్టు నీది, నాది ఏం పోతుంది అంటూ ప్రజలే కదా నష్టపోయే వారు అంటూ విమర్శలు గుప్పించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తీరు పట్ల తన వ్యాఖ్యలతో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు కేశినేని నాని.

MP Kesineni Nani satires that CM Jagan gave great gift to the farmers on his birthday

ఏపీ శాసనసభ సమావేశాల చివరి రోజు రాజధాని అంశంపై ఏపీ అసెంబ్లీ లో జరిగిన సుదీర్ఘ చర్చలో సీఎం జగన్ మోహన్ రెడ్డి సూచనప్రాయంగా ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులు ఉంటె బాగుంటుంది అని చేసిన ప్రకటనపై ఇప్పటికే రాజధాని రైతుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. నేడు సీఎం జగన్ పుట్టిన రోజున నిరసనలు మిన్నంటుతున్నాయి .ఇక నిపుణుల కమిటీ కూడా అదే ధోరణిలో మాట్లాడటం అందుకు ఊతం ఇచ్చింది. ఇక మరోపక్క ఏపీలోని ప్రతిపక్ష టీడీపీ జగన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఏపీకి మూడు రాజధానులు అంటూ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు అనాలోచిత వ్యాఖ్యలని టీడీపీ నేతలు తమదైన శైలిలో మండిపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+