మెంటలెక్కిందని అనుకుంటున్నారు.. ఆ నాయుడి పేరేమి : ఎంపీ విజయసాయి ప్రశ్నకు నెటిజన్ల షాకింగ్ ఆన్సర్స్
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబు టార్గెట్ గా వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఇప్పటికీ చక్రం తిప్పుతున్నారు అని కాకపోతే అది ముందు నుంచి వెనక్కు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ మెంటల్ ఎక్కిందని అనుకుంటున్న ఆ నాయుడు పేరేంటి అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు విజయసాయిరెడ్డి.

విజయసాయి ప్రశ్నకు నెటిజన్లు ఏ మాత్రం తగ్గకుండా జవాబిచ్చారు .
సానుభూతి కోసం మెట్ల మీద కూర్చుంటున్నాడు .. నేలమీద పడుకుంటున్నాడు..
రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్లో చేసిన పోస్ట్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ని టార్గెట్ చేశారు . మెట్ల మీద కూర్చుంటున్నాడు . నేలమీద పడుకుంటున్నాడు. బాసి పీటలు వేస్తున్నాడు. ఏం చేసినా సానుభూతి రాకపోగా మెంటలెక్కిందని జనం అనుకుంటున్నారు ఆ నాయుడు పేరేంటి ? అంటూ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వేసిన ప్రశ్నకు నెటిజన్ల నుండి ఆసక్తికర సమాధానాలు వస్తున్నాయి.

చంద్రబాబుకు కొత్త పేర్లను పెట్టి నెటిజన్ల సమాధానాలు , కొందరు రివర్స్ లో
కిస్మిస్ నాయుడు మనవడు, ఖర్జూర నాయుడు కొడుకు, పప్పు నాయుడు తండ్రి, పవన్ నాయుడు దత్త తండ్రి అంటూ చంద్రబాబు నాయుడు పై సెటైర్లు వేస్తున్నారు. అంతేకాదు జూమ్ నాయుడు, వెన్నుపోటు నాయుడు, మీడియా నాయుడు, పొత్తుల నాయుడు అంటూ నెటిజన్లు సమాధానమిస్తున్నారు.
మరికొందరు విజయసాయిరెడ్డి వేసిన ప్రశ్నకు తిరిగి రివర్స్ కౌంటర్ కూడా వేస్తున్నారు . పొడుపుకథలు వేస్తాడు , గోలి కాయలు ,గచ్చకాయలు ఆడతాడు, ఎంపీని అంటాడు కాని ఎంపీ కాదు ఎవరా రెడ్డి అంటూ విజయసాయి రెడ్డి కి రివర్స్ పంచ్ వేశారు కొందరు నెటిజన్లు.

విజయసాయికి రివర్స్ పంచ్ ... ఎవరా రెడ్డి అంటూ ప్రశ్న
మొత్తానికి సోషల్ మీడియా వేదికగా విజయసాయి రెడ్డికి కూడా ఎవరా రెడ్డి అంటూ రివర్స్ ఎటాక్ చేశారు కొందరు . విజయసాయి పెట్టే ఆసక్తికర పోస్టులకు, అంతే ఆసక్తికర సమాధానాలు కూడా వస్తున్నాయి. టిడిపి అధినేత చంద్రబాబును, టిడిపి నాయకులను మొదటినుండి టార్గెట్ చేస్తూ వస్తున్న విజయసాయిరెడ్డి చంద్రబాబునాయుడు ఏం చేసినా ఏపీ ప్రజల నుంచి పెద్దగా స్పందన రావడం లేదని వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగానే ఆ నాయుడు పేరేంటి అంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు.

అచ్చెన్నాయుడు టీడీపీలో ఉండేలా లేరన్న విజయసాయి
అంతేకాదు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ని టార్గెట్ చేసి విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేశారు . ఇటీవల కాలంలో వైసిపి నేతలను టార్గెట్ చేసి అచ్చెన్నాయుడు తెగ సవాల్ చేస్తున్నారు .అచ్చెన్నాయుడు సవాలు చూస్తుంటే టిడిపిలో ఉండేలా లేడు .అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కరిని వదలనంటున్నాడు అచ్చెన్నాయుడు . టిడిపి అధికారంలోకి రాదని అచ్చెన్నాయుడుకి కూడా తెలుసు అంటూ, అచ్చెన్నాయుడు కూడా టీడీపీని వదిలి పోతాడని విజయ సాయి రెడ్డి వ్యాఖ్యానించారు