విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయవాడలో 144 సెక్షన్: యూటీఎఫ్ ఆందోళనకు నో పర్మిషన్: అతిక్రమిస్తే కఠిన చర్యలు

|
Google Oneindia TeluguNews

విజయవాడ: యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్.. తన ఆందోళనను మరింత ఉధృతం చేయనుంది. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌)ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తోన్న యూటీఎఫ్ సోమవారం ఛలో సీఎంఓ ఆందోళనకు పిలుపునిచ్చింది. అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలయిన తరువాత కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీపీఎస్‌ను రద్దు చేయట్లేదంటూ మండిపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు ఈ ఆందోళనలో పాల్గొనాలని సూచించింది.

మోడీ పర్యటన వేళ.. జమ్మూలో పేలుడు కలకలం: ప్రధాని సభకు కొద్దిదూరంలో: ఉల్కపాతంగామోడీ పర్యటన వేళ.. జమ్మూలో పేలుడు కలకలం: ప్రధాని సభకు కొద్దిదూరంలో: ఉల్కపాతంగా

సీపీఎస్ రద్దు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా మంత్రులతో కమిటీని ఏర్పాటు చేయడాన్ని యూటీఎఫ్ తప్పుపడుతోంది. కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందంటూ ఆరోపణలు చేస్తోంది. సీపీఎస్‌ రద్దు వ్యవహారంపై చర్చలు జరుపుతామని, దీనికోసం తేదీలను కూడా ఖరారు చేసిన తరువాత కూడా ప్రభుత్వం వెనకడుగు వేస్తోందంటూ విమర్శలు చేస్తోన్నారు యూటీఎఫ్ నాయకులు. చర్చల కోసం సమావేశాలను వాయిదా వేస్తోందని, ఇప్పుడా ఊసే ఎత్తట్లేదని వారు చెబుతున్నారు.

No permission to UTF leaders protest, 144 section will impose in Vijayawada, says Police Commissioner

రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ సీపీఎస్‌ను రద్దు చేశాయని, పాత పింఛన్ల విధానాన్నే అమలు చేస్తున్నాయని యూటీఎఫ్ నేతలు గుర్తు చేశారు. ఆయా రాష్ర్టాల్లో కూడా ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రమేనని, అయినప్పటికీ ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సీపీఎస్‌ను రద్దు చేశాయని పేర్కొంటున్నారు. జగన్ ప్రభుత్వం మాత్రం దాన్ని పట్టించుకోవట్లేదని ధ్వజమెత్తుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తోన్నారు.

సీపీఎస్‌ రద్దు కోసం ఈ నెల 18వ తేదీన చేపట్టిన బైక్‌ ర్యాలీలు సోమవారం నాటికి విజయవాడకు చేరుకుంటాయని, ఈలోగా ప్రభుత్వం తన తుది నిర్ణయాన్ని ప్రకటించాలంటూ యూటీఎఫ్ నేతలు డిమాండ్ చేస్తోన్నారు. ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన వెలువడకపోతే సీఎంఓను ముట్టడిస్తామని హెచ్చరించారు. సీపీఎస్ రద్దు అనేది రెండు లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల జీవితాలతో ముడిపడి ఉన్న కీలక అంశమని అన్నారు.

కాగా- సీపీఎస్ రద్దు కోరుతూ యూటీఎఫ్ నేతలు తలపెట్టిన నిరసన ప్రదర్శనలు, ఆందోళనలకు అనుమతులు లభించలేదు. ఛలో సీఎంఓ కార్యక్రమం విరమించుకోవాలంటూ విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా యూటీఎఫ్ నేతలకు విజ్ఞప్తి చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని విజయవాడలో 144 వ సెక్షన్ అమలులో ఉంటుందని, నిబంధనలను ఉల్లంఘించవద్దని సూచించారు.

English summary
No permission to UTF leaders' protest, 144 section will impose in Vijayawada, says Police Commissioner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X