విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో స్కూల్స్ రీ ఓపెన్ మరో రోజుకు వాయిదా.. కారణమిదే

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల రీ ఓపెన్ మరో రోజు వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం వచ్చేనెల 4వ తేదీన ప్రారంభం కావాల్సి ఉంది. దానిని మరో రోజుకు పొడగించారు. 4వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏపీలో పర్యటన ఉంది. అందుకోసమే ఒకరోజు ఆలస్యంగా స్కూల్స్ ఓపెన్ కానున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

మంగళగిరి పరిధిలో కొత్తగా నిర్మించిన ఎయిమ్స్‌ను ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయ్యింది. విశాఖపట్టణం, భీమవరం, గుంటూరు జిల్లాలో పర్యటిస్తారు. అందుకోసమే ఒకరోజు ఆలస్యంగా స్కూల్ ఓపెన్ అవనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

one more day extended to school reopen at AP

తొలుత విశాఖపట్టణంలో బీజేపీ బహిరంగ సభ ఉంటుంది. అక్కడ మోడీ పాల్గొంటారు. తర్వాత భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. మోడీ షెడ్యూల్ నేపథ్యంలోనే స్కూల్స్ రీ ఓపెన్ వాయిదా పడింది.

వాస్తవానికి ఏపీలో ఎన్నికల సమయం సమీపిస్తోంది. దాదాపు రెండేళ్ల సమయం ఉన్నా.. రాజకీయ పార్టీలు మాత్రం ప్రచారంలో మునిగాయి. అందుకే బీజేపీ కూడా తెలుగు రాష్ట్రాలను టార్గెట్ చేశాయి. తెలంగాణ పర్యటన ముగిసిన తర్వాతే మోడీ ఏపీలో అడుగు పెడతారు. కేంద్రమంత్రులు కూడా ఆయనతో ఉంటారు. తెలుగు రాష్ట్రాలు, తమిళనాడులో బీజేపీకి అంతగా ఓటుబ్యాంకు లేదు. ఆ పార్టీ సింగిల్ డిజిట్‌కే పరిమితం. కానీ పార్టీని మరింత విస్తరించాలని కమలదళం అనుకుంటోంది. అందుకే వరసగా పర్యటనలు చేస్తోంది.

English summary
one more day extended to school re-open at Andhra pradesh due to prime minister narendra modi tour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X