Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ దగ్గర వేరుశనగ పప్పు , కేసీఆర్ దగ్గర పొట్టు ఉందన్న పయ్యావుల .. పప్పేదో పొట్టేదో అన్న బుగ్గన

ఏపీ అసెంబ్లీ వేదికగా టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ , వైసిపి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. సాగునీటి ప్రాజెక్టులు నదీజలాల విషయంలో కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డి ల తీరుపై వేరుశనగ పప్పు, పొట్టు అంటూ వ్యాఖ్యలు చేశారు పయ్యావుల కేశవ్. ఇక కేశవ్ వ్యాఖ్యలకు ప్రతిగా ఆర్థిక మంత్రి బుగ్గన పప్పేదో పొట్టేదో మాకు తెలియాడు..తెలుసుకుంటాంలేవో అని సమాధానం ఇచ్చారు.

సాగునీటి ప్రాజెక్ట్ లు, నదీ జలాల పంపకాలపై పయ్యావుల వర్సెస్ బుగ్గన

సాగునీటి ప్రాజెక్ట్ లు, నదీ జలాల పంపకాలపై పయ్యావుల వర్సెస్ బుగ్గన

ఏపీ శాసనసభలో సాగునీటి ప్రాజెక్ట్ లు, నదీ జలాల పంపకాలపై ఆసక్తికర చర్చ జరిగింది . సాగునీటి ప్రాజెక్టులు, నదీ జలాల విషయమై జరిగిన చర్చలో అప్పుడు హిట్లర్ అన్న కేసీఆర్ ఇప్పుడు అపర భగీరధుడయ్యారా జగన్ కు అని మండిపడ్డారు. గతంలో నదీజలాల విషయంలో తెలంగాణ వైఖరిని విమర్శించిన జగన్, ఈ రోజున కేసీఆర్ ను పొగుడుతున్నారని టీడీపీ సభ్యులు వ్యాఖ్యలు చేశారు . ఏపీ ప్రయోజనాలకు భంగం వాటిల్లేలా జగన్ తో కేసీఆర్ ప్రతిపాదనలు ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యుడు పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, రేపు తెలంగాణ భూభాగంపై కాల్వలు వస్తే, అక్కడి బీడు భూములను అన్నింటినీ తడుపుకుంటూ మనకు నీళ్లు రావాలని, ఆ నీళ్లు మనకు చేరతాయన్న నమ్మకం లేదని అన్నారు. బయట బాగా ప్రచారంలో ఉన్న ఓ విషయం ప్రస్తావిస్తున్నా అంటూ వేరుసెనగ పప్పు, పొట్టు కథ చెప్పారు పయ్యావుల కేశవ్ .

పప్పు , పొట్టు కథ చెప్పి కేసీఆర్ తెలివిగా వ్యవహరిస్తున్నారన్న పయ్యావుల

పప్పు , పొట్టు కథ చెప్పి కేసీఆర్ తెలివిగా వ్యవహరిస్తున్నారన్న పయ్యావుల

ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మంచి వేరుశనగపప్పు ఉంది. కేసీఆర్ గారి దగ్గర దాని పొట్టు ఉంది. మీ పప్పును, పొట్టును కలుపుకుని, ఇద్దరం చెరి సగం తీసుకుందాం అన్న చందంగా కేసీఆర్ వ్యవహార శైలి ఉంది . తినేముందు, పొట్టును ఊదుకుని తిందాం అన్నట్టుగా కేసీఆర్ గారు పెట్టిన ప్రతిపాదన ఉందని అంటున్నారు అని పయ్యావుల వ్యాఖ్యానించారు. కనుక, ఎవరు తెలివైన వాళ్లో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం వాటిల్లకుండా తీసుకునే ఏ చర్యను ప్రభుత్వం తీసుకున్నా, ప్రధాన ప్రతిపక్షంగా, రైతు పక్షపాతిగా టీడీపీ అభినందిస్తుందని పయ్యావుల పేర్కొన్నారు .

 పప్పేదో పొట్టేదో తెలియదని .. మేం కూడా తెలుసుకుంటామన్న బుగ్గన

పప్పేదో పొట్టేదో తెలియదని .. మేం కూడా తెలుసుకుంటామన్న బుగ్గన

ఇక పయ్యావుల చేసిన వ్యాఖ్యలపై బుగ్గన మాట్లాడుతూ ఎపి మంత్రి బుగ్గన్న రాజేంద్రనాథ్ మాట్లాడుతూ, స్వయం సమృద్ధి అని మరియు దాని స్వంత వనరులను ఉత్పత్తి చేయగలదని భావించేంతవరకు ఇతర రాష్ట్రాల జోక్యాన్ని ఏ రాష్ట్రమూ ఇష్టపడదని అభిప్రాయపడ్డారు . రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ, నీటి వనరులను ఉపయోగించడం , సాగునీటి ప్రాజెక్ట్ ల అంశంపై టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అడిగిన ప్రశ్నకు ఎపి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో సమాధానమిచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి భాగస్వామ్య ప్రక్రియ విషయంలో పలు కీలక అంశాలను బుగ్గన ప్రస్తావించారు. ఇక పప్పు, పొట్టు వ్యాఖ్యలకు స్పందించిన బుగ్గన పప్పేదో , పొట్టేదో మాకైతే తెలియదని, త్వరలోనే తెలుసుకుంటామని వ్యాఖ్యానించారు .

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+