ఏపీలో ప్లెక్సీ రగడ, జగన్, గడ్కరీ ఫోటోలు, మోడీ ఫోటో మిస్సింగ్, బీజేపీ నేతల కస్సు బుస్సు

ఏపీ రాజకీయాల్లో ప్లెక్సీ వివాదం రాజుకుంది. అభివృద్ది కార్యక్రమాల కోసం ఎల్లుండి (17వ తేదీన) కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వస్తున్నారు. ఈ సందర్భంగా గడ్కరీ, సీఎం జగన్ ఫోటోలు ఫ్లెక్సీ మీద దర్శనం ఇచ్చాయి. మోడీ ఫోటో కనిపించలేదు. ఇంకేముంది బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. వైసీపీ సర్కార్‌ తీరుపై ధ్వజమెత్తాయి. రాష్ట్రంలో వివిధ అభివృద్ది కార్యక్రమాల కోసం ప్రధాని మోడీ నిధులు మంజూరు చేశారని గుర్తుచేశారు.

కావాలనే ఫోటో పెట్టలేదు..

కావాలనే ఫోటో పెట్టలేదు..

రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మోడీ ఫొటో పెట్టలేదని బీజేపీ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా మోడీ అభివృద్ధి చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రాజు అన్నారు. రాష్ట్రం లో జాతీయ రహదారుల నిర్మాణానికి వేల కోట్లు కేటాయించారని తెలిపారు. కానీ ఇలా చేయడం మంచి పద్దతి కాదన్నారు. 22 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టినా.. ఎక్కడా మోడీ ఫొటో లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుందని వివరించారు.

కుట్ర చేశారు..

కుట్ర చేశారు..

ఎందుకు కుట్ర చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పీఎంఓ అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. అభివృద్ది పనులను కూడా ఏపీ ప్రభుత్వం రాజకీయ కోణంలో చూడటం తగదన్నారు. జరిగే పనులున్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతో సాగుతున్నాయని మరో నేత, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస వర్మ అన్నారు. ప్రొటోకాల్ వివాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 24 ప్రధాని మోడీ ఫొటో ఏర్పాటు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

ప్రజలకు తెలియద్దా..?

ప్రజలకు తెలియద్దా..?

కేంద్ర మంత్రి ప్రారంభోత్సవానికి వస్తున్న క్రమంలో ప్రధాని మోడీ ఫ్లెక్సీ ఏర్పాటు చేయకపోవడం సరికాదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర వెంకట శివన్నారాయణ అన్నారు. మోడీ ఫొటోను ఉద్దేశపూర్వకంగా లేకుండా చేశారని.. ఆయన చేస్తున్న అభివృద్ధి ప్రజలకు తెలియకుండా చేసేలా కుట్ర చేశారని బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఒక్క రూపాయి రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేవని బీజేపీ నేతలు అంటున్నారు. సొమ్ము ఒకడిది సోకొకడిది అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తీరు ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి తమదిగా చెప్పుకుంటున్నారని.. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు మారుస్తున్నారని మండిపడ్డారు. ఏమారుస్తున్నారు

ఏం చేస్తుందో చూడాలీ మరీ..

ఏం చేస్తుందో చూడాలీ మరీ..


బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మరీ దీనిపై అధికార వైసీపీ స్పందించాల్సి ఉంది. అయితే కార్యక్రమానికి సమయం ఉండటంతో ప్లెక్సీ మార్చే అవకాశం ఉంది. మరీ వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలీ మరీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+