చంద్రబాబు ఓటమికి దుర్గగుడిలో ఓక్కరోజు దీక్ష

చంద్రబాబు ఓటమి కోసం దీక్ష చేస్తామంటూన్నారు తెలంగాణ టీడీపీ నేతలు,అది కూడ ఆయన స్వంత రాష్ట్రమైన విజయవాడ దుర్గమ్మ చెంతన చేస్తారట, గతంలో ఆయన ఒటమికి తిరుపతి మెట్లు ఎక్కానంటున్నాడు,ఇప్పుడు దీక్షను చేపట్టి చంద్రబాబు ఓడిపోవాలని దుర్గమాతను వేడుకుంటానని చెబుతున్నారు.

 చంద్రబాబు పై మోత్కుపల్లి ఫైర్

చంద్రబాబు పై మోత్కుపల్లి ఫైర్

తెలంగాణ లో చంద్రబాబు నమ్ముకున్న పార్టీ నేతలే ఆయనపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు , రానున్న ఎన్నికల్లో ఆయన ఓడిపోవాలని కోరుకుటుంన్నారు.దీంతో పాటు ఆయన ప్రత్యర్థిగా ఉన్న జగన్ గెలుపును కోరుకుంటున్నారు,ఈ నేపథ్యంలోనే ఆయనకు తెలంగాణలో అంత్యంత విశ్వాసంగా ఉన్న మోత్కుపల్లి నర్సింహులు చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేశారు .

చంద్రబాబు ఓడిపోవాలని దుర్గ గుడిలో దీక్ష

చంద్రబాబు ఓడిపోవాలని దుర్గ గుడిలో దీక్ష

చంద్రబాబును రాజకీయంగా సమాధి చేయాలని విజయవాడ దుర్గమ్మ చెంత ఒక్కరోజు దీక్ష చేయనున్నట్టు తెలంగాణ మాజి టీడిపీ నేత మోత్కుపల్లి ప్రకటించాడు, ఈనేపథ్యంలోనే చంద్రబాబుపై విరుచుకుపడ్డారు మోత్కుపల్లి, లక్షల కోట్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించారని ఆయన ఆరోపించారు. దీంతో డబ్బులు పంచి గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని ఆయన అన్నారు,, ఓవైపు జగన్ ఎండలో ఎన్నికల మీటింగ్ లు పెడితే చంద్రబాబు మాత్రం ఏసిలో కుర్చిలు వేసి సమావేశాలు పెడుతున్నారని విమర్శించారు. ఓక్కో రాజ్యసభ సీటును వంద కోట్లకు అమ్ముకున్న పెద్ద దొంగ చంద్రబాబు అంటు ఫైర్ అయ్యారు, అయనకు నిజంగా చరిష్మ ఉంటే ఇంట్లో కూర్చోని గెలిచేవాడని అన్నారు. తెలంగాణలో చంద్రబాబు వల్లే పార్టీ నష్టపోయేదని అన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు వల్లే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని వారే చెబుతున్నారని అన్నారు.కాగా వైసిపి కి చెందిన 22మందిని పార్టీలో చేర్చుకుని మంత్రి పదవులు ఇవ్వడం ఎంతవరకు సమంజమని ప్రశ్నించారు.గతంలో కూడ చంద్రబాబు ఓడిపోవాలనే ఎన్టీఆర్ ఆశయం మేరకు తిరుమలకు నడుచుకుంటూ వెళ్లాలని తెలిపారు.

గవర్నర్ పదవి పై మోత్కుపల్లికి హమీ

గవర్నర్ పదవి పై మోత్కుపల్లికి హమీ

కాగా తెలంగాణ ఉద్యమంలో కూడ మోత్కుపల్లి చంద్రబాబుకు మద్దతుగా ఉన్నారు. చాల సమయాల్లో ప్రస్తుత సిఎమ్ కేసిఆర్ పై ఆయన విరుచుకుపడ్డారు. దళిత నేత కావడంతోపాటు ఆయన వాగ్ధాటిని చంద్రబాబు ఉపయోంచుకున్నారు, ఈ నేపథ్యంలోనే చంద్రబాబు బిజేపి తో పోత్తుపెట్టుకుని అధికారంలోకి వచ్చారు.అనంతరం మోత్కుపల్లికి గవర్నర్ పదవిని ఇప్పిస్తానని చంద్రబాబు హమీ ఇచ్చారు .దీంతో మోత్కుపల్లి ఎక్కడికి వెళ్లకుండా టీడీపీనే అంటిపెట్టుకుని ఉన్నారు. చాల కాలం వరకు ఎలాంటీ పదవి దక్కకపోవడంతో మోత్కుపల్లి ఇటివల టీడీపీకి రాజీనామ చేశారు. దీంతో చంద్రబాబు పై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు గెలిచే చరిష్మా లేదని ఫైర్ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+