విజయవాడలో రెచ్చిపోయిన సైకో.. వాహనదారులకే కాదు.. పోలీసులకు కూడా ముప్పుతిప్పలు
విజయవాడ : నడిరోడ్డుపై సైకో రెచ్చిపోయాడు. వాహనదారుల్ని, పాదచారుల్ని ముప్పుతిప్పలు పెట్టాడు. పంజా సెంటర్ దగ్గర జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ఆ దారిలో వెళుతున్నవారిపై సైకో వీరంగం సృష్టించాడు.
పంజా సెంటర్ మీదుగా ప్రయాణించిన వాహనదారులను, ఆ రోడ్డు గుండా వెళుతున్న పాదచారులకు నరకం చూపించాడు సైకో. కర్రలు, సీసాలు చేతబట్టి కనిపించినవారినల్లా బెదరగొట్టాడు. సైకో గాడి దెబ్బకు జనాలు బెంబెలెత్తిపోయారు.

పంజా సెంటర్‌లో సైకో వీరంగం చేస్తున్నాడనే సమాచారంతో పోలీసులు వెంటనే స్పాట్‌కు చేరుకున్నారు. వాడిని నిలువరించే ప్రయత్నం చేసినా వీలుకాలేదు. అంతేకాదు పోలీసులకు మూడు చెరువుల నీళ్లు తాగించాడు. అక్కడే ఉన్న అండర్ డ్రైనేజీలోకి వెళ్లి దాక్కున్నాడు. దాంతో ఆ సైకోగాడిని బయటకు తీసుకురావడానికి ఖాకీలు నానా తిప్పలు పడుతున్నారు.












Click it and Unblock the Notifications