విజయవాడలో టీడీపీ ఖాళీ: వైసీపీలో చేరిన మరో సీనియర్
Kesineni Nani: సార్వత్రిక ఎన్నికలు సమీపించిన వేళ.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో కల్లోలం చోటు చేసుకుంటోంది. పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఆ పార్టీకి ప్రతికూలంగా మారుతున్నాయి. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అనుసరిస్తోన్న ధోరణి- సీనియర్లను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తోంది.
ఇప్పటికే విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని, ఆయన కుమార్తె కేశినేని శ్వేత.. తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తిరువూరుకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ ఆయన బాటలోనే సాగారు. వైసీపీలో చేరారు.

దీనికి బ్రేకులు పడట్లేదు. తాజాగా విజయవాడకే చెందిన మరో సీనియర్ నేత గోగుల వెంకట రమణ రావు.. తెలుగుదేశం పార్టీని వీడారు. వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా కండువాను కప్పి.. పార్టీలో సాదరంగా ఆహ్వానించారు జగన్.
ఆ సమయంలో వెంకటరమణ వెంట.. కృష్ణా జిల్లాకు చెందిన గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని ఉన్నారు. కొద్దిసేపటి కిందటే వారంతా వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. విజయవాడలో చోటు చేసుకుంటోన్న రాజకీయ పరిణామాలపై విస్తృతంగా చర్చించారు.

విజయవాడలో తెలుగుదేశం పార్టీ ఖాళీ చేయిస్తానంటూ గతంలోనే ప్రకటించారు కేశినేని నాని. దీనికి అనుగుణంగా ఆయన వ్యూహాలు వేస్తోన్నారు. తన అనుచరులు, కొందరు మాజీ ఎమ్మెల్యేలను టీడీపీ నుంచి బయటికి తీసుకొస్తోన్నారు. ఇప్పటికే నల్లగట్ల స్వామిదాస్‌ను వైఎస్ఆర్సీపీలో చేర్చగలిగారు.












Click it and Unblock the Notifications