మా పార్టీ స్టాండ్ క్లియర్‌గా ఉంది: ఇంగ్లీష్ మీడియంపై సుధీష్ రాంభొట్ల

విజయవాడ: గత వారం ఏపీ హైకోర్టు నిర్బంధ ఇంగ్లీష్ మీడియంపై ఇచ్చిన తీర్పునకు సంబంధించి వైసీపీకి చెందిన వారు తనపై అబద్దాలు ప్రచారం చేస్తున్నారని, ఎంపీ విజయ సాయి రెడ్డి కూడా తనపై అసత్యాలు మాట్లాడారని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి సుధీష్ రాంభొట్ల ఆవేదన వ్యక్తం చేశారు.

తానేదో చంద్రబాబు మనిషిగా ఆయన చెప్పారని, కానీ తమ పార్టీ స్టాండ్ క్లియర్‌గా ఉందని చెప్పారు. నిర్బంధ ఇంగ్లీష్ మీడియం ఉండవద్దని, తెలుగు మీడియం కూడా కంటిన్యూ చేయాలని తమ పార్టీ నేతలంతా చెప్పారన్నారు.

Sudhish Rambhotla fires at Vijaya Sai Reddy

Recommended Video

    Sri Reddy Supports MLA Roja In Latest Controversy

    టీడీపీ వారో, ఇంకెవరో చెబితే తాను ఎందుకు చేస్తానని ప్రశ్నించారు. తెలుగు వారిపై బలవంతంగా ఇంగ్లీష్ రుద్దవద్దని విజ్ఞప్తి చేశారు. తెలుగు మీడియంతో ఉండే ప్రయోజనాలు తాను చెప్పేందుకు సిద్ధమని చెప్పారు. విద్యార్థులు మాతృభాషలో చదువు కోవాలన్నాం, కానీ ఇంగ్లీష్ మీడియం వద్దని చెప్పలేదన్నారు. దీన్నే యునెస్కోతో పాటు మహాత్మా గాంధీ నుండి నెల్సన్ మండేలా వరకు చెప్పారన్నారు. ఇటలీ, జర్మనీ వంటి దేశాలు మాతృభాషకు ప్రాధాన్యత ఇస్తాయన్నారు. హైదరాబాదులోని ఆ భాషలు ప్రత్యేకంగా నేర్పుతారని గుర్తు చేశారు. గతంలో టీడీపీ జెడ్పీటీసీ, మున్సిపల్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టినప్పుడు విజయసాయి రెడ్డి వ్యతిరేకించారని గుర్తు చేశారు. బలవంతపు ఇంగ్లీష్ మీడియం రుద్దవద్దన్నారు. అవసరమైతే ఈ అంశంపై సుప్రీం కోర్టులోను పోరాడుతామన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+