గుడివాడ గడ్డపై చంద్రబాబు- కొడాలి నాని అమీతుమీ
Chandrababu Naidu: రేపు.. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వర్ధంతి. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కృష్ణాజిల్లాలోని గుడివాడకు బయలుదేరి వెళ్లనున్నారు. ఎన్టీఆర్ స్వస్థలం నిమ్మకూరు ఈ నియోజకవర్గం పరిధిలో ఉండటం వల్ల కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే నివాళి అర్పించనున్నారు.
దీనితోపాటు రా.. కదలిరా కార్యక్రమాన్ని గుడివాడలో నిర్వహించనున్నారాయన. రోడ్ షో, బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఉమ్మడి కృష్ణాజిల్లాల తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోన్నారు.

మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా మహేశ్వరరావు, గుడివాడకు చెందిన పార్టీ నాయకులు రావి వెంకటేశ్వర రావు, వెనిగండ్ల రాము, విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్.. అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షిస్తోన్నారు. చంద్రబాబుకు ఘన స్వాగతం పలకడానికి రంగం సిద్ధం చేస్తోన్నారు.
ఇందులో భాగంగా- గుడివాడలో భారీగా స్వాగత తోరణాలను నెలకొల్పారు. బ్యానర్లు కట్టారు. పసుపు జెండాలతో గుడివాడను నింపేశారు. కేశినేని నాని సహా పలువురు టీడీపీ నాయకులు పార్టీకి గుడ్‌బై చెప్పిన అనంతరం ఉమ్మడి కృష్ణా జిల్లాలో అడుగుపెట్టబోతోండటం ప్రతిష్ఠాత్మకంగా మారింది.
గుడివాడలో రా.. కదలిరా సభను తమ బలప్రదర్శనగా భావిస్తోంది టీడీపీ. ముదినేపల్లి మార్గంలో బహిరంగ సభ వేదికను సిద్ధం చేస్తోంది. ఈ సభకు పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించే ప్రయత్నాల్లో ఉంది టీడీపీ. ఉమ్మడి కృష్ణాజిల్లాతో పాటు గుంటూరు నుంచీ జనాన్ని చంద్రబాబు సభకు తరలించనుంది.
అదే సమయంలో- అటు వైఎస్ఆర్సీపీకి చెందిన గుడివాడ శాసనసభ్యుడు, మాజీ మంత్రి కొడాలి నాని సైతం ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. స్వతహాగా కొడాలి నాని.. ఎన్టీఆర్ అభిమాని కావడం వల్ల ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించడానికి చర్యలు తీసుకున్నారు. అన్నదాన కార్యక్రమాన్నీ నిర్వహించనున్నారాయ.
ఫలితంగా- గుడివాడలో పోటాపోటీగా బ్యానర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. కొన్ని చోట్ల ఒకరి బ్యానర్లు, ఫ్లెక్సీలను మరొకరు చింపేశారు. తగులబెట్టారు. ఈ పరిణామాలు కాస్త ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటోన్నారు పోలీసులు.
-
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!











Click it and Unblock the Notifications