వైయస్ అనుమతిస్తే..జగన్ కూల్చేస్తున్నారు: కక్ష్య సాధింపు చర్యలే.. టీడీపీ నేతల ఫైర్..!
Recommended Video
కృష్ణా కరకట్ట మీద అక్రమంగా నిర్మించారనే కారణంతో చంద్రబాబు నివాసానికి నోటీసులు ఇవ్వటం పైన టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. వైయస్సార్ ముఖ్యమంత్రిగా అనుమతిస్తే నర్మించిన కట్టడాలను ఆయన తనయుడు జగన్ కూల్చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇది టీడీపీ అధినేత పైన కక్ష్య సాధింపు చర్యగా అభివర్ణిస్తున్నారు. తండ్రి పేరుతో పార్టీ నడుపుతున్న కుమారుడు జగన్ ఈ నిర్మాణాలకు బాధ్యత వహించాలనే వాదన తెర మీదకు తెచ్చారు. అసలు కోర్టులో ఉన్న వ్యవహారంలో నోటీసులు ఎలా ఇస్తారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఇది కక్ష్య సాధింపు చర్యే ..
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ నివాసంలో అద్దెకు ఉంటున్నారని..ఉద్దేశ పూర్వకంగానే నోటీసులు ఇవ్వటం చూస్తుంటే జగన్ కక్ష్యసాధింపుకు పాల్పడుతున్నారనే విషయం ఆర్దం అవుతోందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ప్రస్తుతం చంద్రబాబు ఉంటున్న నివాసం నాడు వైయస్ హయాంలో నిర్మించారని.. అక్రమంగా నిర్మించారని భావిస్తే నాడు వైయస్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. వైయస్ ప్రభుత్వం నాడు అక్రమ కట్టడాలకు ఎందుకు అనుమతి ఇచ్చిందనేది టీడీపీ నేతల ప్రశ్న.వైయస్ వారసుడిగా చెప్పుకుంటూ.. ఆయన పేరుతో పార్టీ- ప్రభుత్వాన్ని నడుపుతున్న జగన్ ఇప్పుడు తన తండ్రి అనుమతించిన నిర్మాణాలకే నోటీసులు పంపుతున్నారంటూ వాదిస్తున్నారు.అవన్నీ అక్రమ నిర్మాణాలైతే జగన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని టీడీపీ నేతలు కొత్త వాదన తెర మీదకు తెచ్చారు.

కోర్టులో కేసు ఉండగా నోటీసులా..
ప్రస్తుతం చంద్రబాబు ఉంటున్న నివాసం సీఆర్డీఏ అనుమతితో జరిగిందని కాదని..వారు నోటీసులు ఎలా ఇస్తారని యనమల ప్రశ్నిస్తున్నారు. ఈ భవనానికి 2008లో గ్రామ పంచాయితీ అనుమతి ఇచ్చిందని చెప్పుకొచ్చారు. రివర్ కన్జర్వేటర్ 2012లో అనుమతి ఇచ్చారని గుర్తు చేసారు. చంద్రబాబుపై కక్షతోనే నదికి 130మీ దూరంలో ఉన్న ప్రజా వేదికను కూలగొట్టారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం విధ్వంసక ప్రభుత్వంగా మారిందని.. పౌరుల పైన దాడులు చేయిస్తోందంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్ర అభివృద్ది పైన జగన్‌కు విజన్ లేదని..పేదల సంక్షేమం పైన చిత్తశుద్ది లేదని విరుచుకుపడ్డారు. బెదిరించడం,దాడులు చేయడం,దౌర్జన్యాలు జరిపించడం జగన్ నిత్యకృత్యాలుగా మారాయని ఆరోపించారు. నోటీసుల వ్యవహారం పైన అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో చర్చించి ఏం చేయాలో నిర్ణయిస్తామని యనమల స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications