విజయవాడ వాహనదారులకు కీలక సూచన- ట్రాఫిక్ మళ్లింపు వివరాలివే..
విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో భవానీ దీక్ష విరమణ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి దేవాదాయ శాఖ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తోన్నారు. బుధవారం నుంచి ఈ నెల 19 వరకు లక్షలాది మంది భవానీలు తమ కఠోర దీక్షను విరమించనున్నారు. ఏడు లక్షల మందికి పైగా భక్తులు కనకదుర్గమ్మ అమ్మవారిని దేవిని దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తోన్నారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేశారు.

లక్షలమంది భవానీలు..
రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు విజయవాడకు రానున్న నేపథ్యంలో తలెత్తే ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వాహనాల రాకపోకలను మళ్లించారు. ఈ నెల 20వ తేదీ వరకు అమల్లో ఉండబోతోన్నాయి ఈ ట్రాఫిక్ ఆంక్షలు. భవానీలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి, అదే సమయంలో వాహనాల రాకపోకలు సజావుగా సాగడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.

మళ్లింపు ఇలా..
విజయవాడ నుంచి హైదరాబాద్, జగ్గయ్య పేట, తిరువూరు వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను దారి మళ్లించారు. పండిత్ నెహ్రూ బస్టాండ్- అవుట్ గేట్- వారధి జంక్షన్- స్క్రూ బ్రిడ్జి- బెంజ్ సర్కిల్, న్యూ ఫ్లైఓవర్- మహానాడు జంక్షన్- రామవరప్పాడు రింగ్ రోడ్- ఇన్నర్ రింగ్ రోడ్డు- కండ్రిక జంక్షన్- పైపుల రోడ్డు జంక్షన్- వైవీ రావు ఎస్టేట్ సర్కిల్- సీవీఆర్ ఫ్లైఓవర్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. కబేళా సెంటర్ వద్ద కుడి వైపునకు తిరిగి.. ఊర్మిళానగర్- అట్కిన్సన్ కాన్వెంట్ రోడ్డు- గొల్లపూడి బైపాస్- గొల్లపూడి వై జంక్షన్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

హైదరా3బాద్ వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు..
హైదరబాద్ వైపు నుంచి విజయవాడకు వచ్చే ఆర్టీసీ బస్సులు యధావిధిగా గొల్లపూడి వై జంక్షన్- స్వాతి జంక్షన్- కనకదుర్గా ఫ్లైఓవర్- రాజీవ్ గాంధీ పార్క్- పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ఇన్ గేటు ద్వారా బస్టాండ్ లోనికి వెళ్లాల్సి ఉంటుంది. విజయవాడ సిటీ బస్ స్టాప్ నుంచి ఇబ్రహీంపట్నం, భవానీపురం, పాల ప్రాజెక్ట్, వైఎస్సార్ కాలనీ వైపు వెళ్లే ఆర్టీసీ సిటీ బస్సులను కూడా అధికారులు దారి మళ్లించారు.

ఆర్టీసీ సిటీ బస్సులు ఇలా..
పండిత్ నెహ్రూ బస్ స్టాండ్- పీసీఆర్ జంక్షన్- ఆర్టీసీ వై జంక్షన్- హోటల్ స్వర్ణా పాలెస్ జంక్షన్- హనుమాన్ పేట- ఏలూరు లాకులు- జీఎస్ రాజు రోడ్డు- సీతన్నపేట గేటు- ప్రభాస్ కాలేజీ- బుడమేరు బ్రిడ్జి- దాబకోట్లు- ఆంధ్రప్రభ కాలనీ- నందమూరి నగర్ రోడ్డు- ఇన్నర్ రింగ్ రోడ్డు- వైవీ రావు ఎస్టేట్ సర్కిల్, సీవీఆర్ ఫ్లైఓవర్ మీదుగా పాల ప్రాజెక్ట్, కబేళా సెంటర్, విద్యాధరపురంచ, ఇబ్రహీంపట్నం వైపు వెళ్లాల్సి ఉంటుంది.

ఇబ్రహీంపట్నం వైపు వెళ్లే బస్సులు ఇలా..
ఇబ్రహీంపట్నం, భవానీపురం, పాల ప్రాజెక్ట్, వైఎస్సార్ కాలనీ వైపు నుంచి పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌కు వెళ్లే ఆర్టీసీ సిటీ బస్సులను దారి మళ్లించారు. ఇబ్రహీంపట్నం వైపు నుంచి వచ్చే సిటీ బస్సులు గొల్లపూడి వై జంక్షన్- స్వాతి జంక్షన్- కనకదుర్గా ఫ్లైఓవర్- రాజీవ్ గాంధీ పార్క్- పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ఇన్ గేటు ద్వారా బస్టాండ్‌లోకి రావాల్సి ఉంటుంది. కబేళా, పాల ప్రాజెక్ట్ నుంచి వచ్చే సిటీ బస్సులు పాలప్రాజెక్ట్- చిట్టినగర్- సొరంగం, సితారా జంక్షన్, జాజి నగర్ చర్చ జంక్షన్, క్రాంబే రోడ్డు, స్వాతి జంక్షన్, కనకదుర్గా ఫ్లైఓవర్- రాజీవ్ గాంధీ పార్క్- పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ఇన్ గేటు ద్వారా బస్టాండ్ సిటీ పోర్ట్ లోనికి వెళ్లాల్సి ఉంటుంది.

ఇతర వాహనాలు..
ఇతర వాహనాలు కనక దుర్గ ఫ్లైఓవర్ మీది నుంచి లేదా చిట్టినగర్ టన్నల్ నుంచి గాని భవానిపురానికి రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. కుమ్మరిపాలెం నుంచి ఘాట్ రోడ్, ఘాట్ రోడ్ నుంచి కుమ్మరిపాలెం వైపునకు ఎలాంటి వాహనాలకు కూడా అనుమతులు ఉండవు. ఈ మార్గంలో వాహనాల రాకపోకలను నిషేధించినట్లు అధికారులు తెలిపారు. తాడేపల్లి నుంచి విజయవాడ, విజయవాడ నుంచి తాడేపల్లి వైపునకు ప్రకాశం బ్యారేజీ మీదుగా వాహనాల రాకపోకలను నిషేధించారు. హైకోర్టు, సచివాలయంలో పని చేసే ఉద్యోగులు కనకదుర్గమ్మ వారధి మీదుగా రాకపోకలు సాగించాల్సి ఉంటుంది.

విజయవాడ నగర వాసుల కోసం..
భవానీ దీక్ష విరమణ సందర్బంగా కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనార్దం వచ్చే భక్తుల వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించారు. విజయవాడ సిటీ పరిధి నుంచి ఇంద్రకీలాద్రికి చేరుకునే వాహనాలకు గాంధీజీ మున్సిపల్ హై స్కూల్ వద్ద పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించారు. హైదరాబాద్, జగ్గయ్య పేట, తిరువూరు వైపు నుంచి వచ్చే ప్రైవేటు వాహనాలకు పున్నమి ఘాట్, భవాని ఘాట్, సుబ్బా రాయుడు ఖాళీ స్థలంలో పార్కింగ్ వసతి ఉంది.

పార్కింగ్ ఇలా..
విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి వైపు నుంచి వచ్చే వాహనాలు సితార సెంటర్ సమీపంలోని పాత సోమా కంపెనీ స్థలంలో తమ వాహనాలను పార్క్ చేయాల్సి ఉంటుంది. మచిలీపట్నం, గుడివాడ, అవనిగడ్డ వైపు నుంచి వచ్చే వాహనాలు బీఆర్టీఎస్ రోడ్‌లో పార్క్ చేసుకోవచ్చు. గుంటూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల నుంచి వచ్చే వాహనాలు వారధి జంక్షన్ వద్ద గల వుడా ఖాళీ స్థలం, కృష్ణలంక సర్వీస్ రోడ్డులో గల ఎం హోటల్ నుంచి నల్లగేట్ వరకు పార్క్ చేసుకోవాలి.












Click it and Unblock the Notifications