బెజవాడ వస్తారా ... లేక హైదరాబాద్ రమ్మంటారా - చంద్రబాబుకు సాయిరెడ్డి సవాల్...
కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ నివాసానికే పరిమితమవుతున్న చంద్రబాబును ఎలాగైనా బయటికి రప్పించేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆయనకు తాజాగా మరో సవాల్ విసిరారు.
విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమకు ఇచ్చిన అనుమతులపై చర్చకు రావాలని వైసీపీ సర్కార్ కు చంద్రబాబు విసిరిన సవాల్ కు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. ఎల్జీ పాలిమర్స్ అనుమతులపై చర్చకు తాను సిద్దమేనని, హైదరాబాద్ నుంచి మీరు విజయవాడ వస్తారా లేక నన్నే హైదరాబాద్ రమ్మంటారా అని చంద్రబాబును ప్రశ్నిస్తూ సాయిరెడ్డి ఇవాళ ట్వీట్ చేశారు.

ఎల్జీ పాలిమర్స్ అనుమతుల విషయంలో హైదరాబాద్ లో కూర్చుని సవాళ్లు విసురుతున్న చంద్రబాబును ఈ వ్యవహారంలో కార్నర్ చేద్దామనే ఆలోచనతో ఉన్న సాయిరెడ్డి తాజా ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.

సాయిరెడ్డి ఈ ట్వీట్ తో ఆగకుండా ఎల్జీ పాలిమర్స్ బాధితులకు పరిహారం విషయంలో విపక్షాల వ్యవహారశైలిని తప్పుబడుతూ మరో ట్వీట్ కూడా చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు దిక్కుతోచడం లేదని, వీళ్లు రూ.20 లక్షలు పరిహారం అడిగితే సీఎం జగన్ కోటి రూపాయలు ఇస్తారని, వీళ్లకు ఆలోచన మెదిలే లోపే ఆయన అమలు చేస్తున్నారని సాయిరెడ్డి పేర్కొన్నారు. గొప్ప సలహా ఇస్తే పాటించకూడదనే పట్టుదలకు పోయే స్వభావం జగన్ ది కాదని, కానీ వీళ్లకు ఆ స్ధాయి ఎక్కడిదని సాయిరెడ్డి చురకలు అంటించారు.
-
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో కొత్త లోక్సభ నియోజకవర్గాలు..రిజర్వేషన్లు ఇలా - ఆ స్థానాల పునరుద్దరణ, ఇవి రద్దు..!! -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!! -
మావిగన్ చర్చ వేళ సీఆర్డీఏ పరిధి పై కీలక నిర్ణయం- ఇక ఇలా..!! -
ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా.. జగన్ బాధిత అధికారి..!? -
అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ కేంద్రాల ప్రారంభం-దేశంలోనే తొలిసారి..! -
Polavaram:పోలవరంకు మహర్దశ - చంద్రబాబు ప్లాన్ అదుర్స్..!! -
వీడ్ని నడిరోడ్డుపై ఉరి తీసినా తప్పులేదు.. 180 మంది బాలికలపై..!!












Click it and Unblock the Notifications