విషాదం: పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ప్రేమజంట ఆత్మహత్య..మృతురాలు అసిస్టెంట్ ప్రొఫెసర్

విజయవాడ: కృష్ణా జిల్లా విజయవాడలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ప్రియురాలు నాగ గౌతమి మృతి చెందగా ప్రియుడు లోకేష్ ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. లోకేష్ స్వస్థలం గుడివాడగా తెలుస్తోంది.

ప్రేమజంట ఆత్మహత్య

ప్రేమజంట ఆత్మహత్య

విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. తమ వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఒక ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు. గన్నవరంకు సమీపంలో ఉన్న తెలప్రోలులోని ఉషారామ ఇంజినీరింగ్ కాలేజీలో గౌతమి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గత కొంతకాలంగా గౌతమి లోకేష్‌లు ప్రేమించుకుంటున్నారు. పెద్దలు వీరి పెళ్లికి నిరాకరించడంతో ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు చెప్పారు.

 ఓ హోటల్‌లో గదిని అద్దెకు తీసుకున్న ప్రేమజంట

ఓ హోటల్‌లో గదిని అద్దెకు తీసుకున్న ప్రేమజంట

ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్న వీరిద్దరూ గాంధీనగర్‌లోని జగపతి హోటల్ నాలుగో ఫ్లోర్‌లో గదిని గురువారం ఉదయం అద్దెకు తీసుకున్నారు. అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సాయంత్రం వరకు తలుపులు తెరుచుకోకపోవడంతో లాడ్జి సిబ్బందికి డౌటు వచ్చింది. ఇక రాత్రి అవడంతో కూడా తలుపులు తెరుచుకోకపోవడంతో లాడ్జి సిబ్బంది తలపులను కొట్టారు. తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది తలుపులు పగలగొట్టి చూడగా ఇద్దరూ గౌతమి లోకేష్‌లు అపస్మారక స్థితిలో ఉన్నారు. వెంటనే సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 గౌతమి అక్కడికక్కడే మృతి

గౌతమి అక్కడికక్కడే మృతి

గౌతమి అక్కడికక్కడే మృతిచెందగా.. లోకేష్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని చెప్పారు. ప్రస్తుతం కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

 ప్రేమ వ్యవహారం తెలియని చెబుతున్న పెద్దలు

ప్రేమ వ్యవహారం తెలియని చెబుతున్న పెద్దలు

మరోవైపు గౌతమి లోకేష్‌ల ప్రేమ విషయం తమకు తెలియదని చెబుతున్నారు గౌతమి కుటుంబ సభ్యులు . వారిద్దరూ ప్రేమించుకుంటున్నారన్న విషయం ముందుగానే చెప్పిఉంటే దగ్గరుండి పెళ్లి చేసేవాళ్లమని చెప్పారు. ఇదిలా ఉంటే గౌతమికి అప్పటికే మరో వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ అయ్యిందని తెలుస్తోంది. ఇక పెద్దవాళ్లు తమ ప్రేమను అంగీకరించరని తెలిసే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అదే సమయంలో గౌతమికి ఎంగేజ్‌మెంట్ అయ్యిందన్న విషయం తెలిసి లోకేష్ ఆత్మహత్యకు ప్రోత్సహించాడా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+