Crime news:ప్రియుడి మోజులో కన్న కొడుకును కడతేర్చిన కసాయి తల్లి.. ఆనవాలు దొరక్కుండా..!

అక్రమసంబంధాలు పెట్టుకుని కన్న బిడ్డలనే కడతేరుస్తున్నారు కొందరు కసాయి తల్లులు. తమ వివాహేతర సంబంధానికి బిడ్డలు అడ్డుగా వస్తున్నారని అడ్డంగా చంపేసి ఆనవాలు కూడా దొరక్కుండా పక్కా ప్లాన్‌తో చేస్తున్నారు కన్నవారు. కొందరు తల్లిదండ్రులు ఆడపిల్ల పుట్టిందని గొంతు నులిమి చంపేస్తుంటే.. మరికొందరు తమ అక్రమ సంబంధాలకు అడ్డుగా ఉన్నారన్న నెపంతో చిన్నారులను చిదిమేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో చోటుచేసుకుంది. సంచలనం సృష్టించిన ఈ ఘటన ఇప్పుడు కృష్ణా జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది.

ప్రియుడి మోజులో...

ప్రియుడి మోజులో...

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడి మోజులో పడ్డ ఓ మహిళ కన్నబిడ్డనే కడతేర్చింది. అనుమంచిపల్లిలో నివాసం ఉంటున్న ఉష అనే మహిళ తన భర్తతో రెండు నెలల క్రితం విడిపోయి ప్రియుడు శ్రీనివాస్‌తో కలిసి ఉంటోంది. ఉషకు ఇద్దరు పిల్లలున్నారు. ఇక శ్రీనివాస్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఉష పిల్లలు అడ్డంగా ఉన్నారని చెప్పి వారిని తొలగించుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే ప్రియుడు శ్రీనివాస్‌తో కలిసి పక్కా స్కెచ్ వేసింది.

ఏడాదిన్నర బాలుడి హత్య

ఏడాదిన్నర బాలుడి హత్య

ఏడాదిన్నర బాలుడిని కనికరం లేకుండా ఉష, శ్రీనులు హత్య చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఆ బాలుడిని కోదాడలోని పంటపొలాల్లో పాతిపెట్టారు. ఇక రెండో కొడుకుని కూడా అడ్డు తొలగించుకోవాలని భావించి ఆ చిన్నారిని కూడా చిత్రహింసలకు గురిచేశారు. కొడుకు పాదాలకు వాతలు పెట్టారు. చితకబాదారు. అయితే బాలుడు గట్టిగా కేకలు పెట్టి ఏడ్చడంతో స్థానికులు ఇంటికి చేరుకున్నారు. జరిగిన విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఉష, శ్రీనులను అదుపులోకి తీసుకున్నారు. శ్రీను గత చరిత్ర అంత నేరమయమే అని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

Recommended Video

    #BabriMasjidVerdict : మసీదు దానికదే కూలిందా? హిట్ అండ్ రన్ కేసు : Prakash Raj || Oneindia Telugu
    నేరంను అంగీకరించిన ఉష

    నేరంను అంగీకరించిన ఉష


    ఉష, శ్రీనులను విచారణ చేయగా.. ఇద్దరు చేసిన నేరాన్ని అంగీకరించారు. చిన్న కొడుకు తమ అక్రమసంబంధానికి అడ్డుగా ఉన్నాడని తామే హత్యచేసి కోదాడలో పాతిపెట్టినట్లు ఒప్పుకున్నారు. ఇక పెద్ద కొడుకును చిత్రహింసలు పెట్టినట్లు అంగీకరించారు. ఇంత దారుణానికి పాల్పడ్డ వీరిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారని కూడా కనికరం చూపకుండా ఇంత దారుణానికి పాల్పడ్డ వీరిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక తన చిన్న కొడుకు ఇక లేడన్న విషయాన్ని తెలుసుకున్న ఉష భర్త భోరున విలపించాడు. ఇంత దారుణానికి పాల్పడుతుందని తాము ఊహించలేకపోయామని ఉష కుటుంబ సభ్యులు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+