గడ్డిపరిక సింహం కాలేదు: మగధీర డైలాగులు..పనికి మాలిన నాయకుడు: చంద్రబాబు పై రోజా ఫైర్..!
వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా మరోసారి శాసనసభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు మీద విరుచుకుపడ్డారు. తీవ్ర వ్యాఖ్యలు చేసారు. సభలోకి వస్తున్న తమతో అసెంబ్లీ మార్షల్ దురుసుగా ప్రవర్తించారని..వారి మీద చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేసారు. ఆ సమయంలో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఉన్మాది లాంటి ముఖ్యమంత్రి ఉన్నారని..అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించటం పైన వైసీపీ సభ్యులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. ఇదే సమయంలో రోజా సైతం స్పందించారు. తాను వైసీపీ ఎమ్మెల్యేగా..చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనను ఏడాది పాటు సస్పెండ్ చేసిన అంశం గురించి గుర్తు చేస్తూ..చంద్రాబు పైన తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఆయనకు వయసుతో పాటుగా చాదస్తం పెరిగిపోయిందని.. మగధీర డైలాగులు చెబుతున్నారంటూ మండిపడ్డారు.
కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా..మార్షల్స్ నాడు
తాను తొలి సారి ఎమ్మెల్యేగా సభలో ఉండగా..కాల్ మనీ వ్యవహరం పైన వాయిదా తీర్మానం ఇచ్చానని నాటి పరిణామాలను గుర్తు చేసారు. ఆ అంశం పైన తాను మాట్లాడే సమయంలో చంద్రబాబును ఉద్దేశించి ఒక పత్రికలో వచ్చిన వార్త ఆధారంగా కామెంట్ చేస్తే..తనను నిబంధనలకు వ్యతిరేకంగా ఏడాది పాటు సస్పెండ్ చేసారని వివరించారు. దీని పైన తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే కోర్టు సైతం కొత్తగా ఏర్పడని రాష్ట్రంలో సమస్యల మీద ఫోకస్ చేయకుండా ఈ సస్సెన్షన్లు ఏంటని కామెంట్ చేసిందని గుర్తు చేసారు. తాను కోర్టు తీర్పుతో సభలోకి వస్తే తనను మార్షల్స్ అడ్డుకున్నారని..ఆ తరువాత తాను భైఠాయిస్తే తనతో దురుసుగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేసారు. నాడు మార్షల్స్ వ్యవహరించిన తీరు పైన నాటి ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

గడ్డిపరక సింహం కాలేదు..పనికి మాలిన నాయకుడు
చంద్రబాబు సభలో గట్టి గట్టిగా అరుస్తున్నారని..ఆయన ఎంత అరిచినా గడ్డిపరిక సింహం కాలేదని రోజా వ్యాఖ్యానించారు. ఆయన పనికి మాలిన నాయకుడని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంటే అడ్డుపుడుతున్నారని విమర్శించారు. మగధీర సినిమా డైలాగులు చంద్రబాబు కొడుతున్నారని.. 151 మంది ఎమ్మెల్యే రండి..సమాధానం చెబుతానని అంటున్నారని ఎద్దేవా చేసారు. నాడు చంద్రబాబు సీఎంగా ఉండగా..ఆయన పార్టీకే చెందిన బోండా నిండు సభలో పాతేస్తా..నరికేస్తా అంటే ఎందుకు తప్పుగా కనిపించలేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు వయసు తో పాటుగా చాదస్తం పెరిగిపోయిందని.. ఆయన్ను ఆస్పత్రిలో చూపించాలని లేకుండా ఇటువంటి ఇబ్బందులు తప్పవని రోజా వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications