తొడలు కొట్టుకోవడానికే తప్ప..: టీడీపీ గాలి తీసిన దేవినేని అవినాష్
విజయవాడ: తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులు నిర్వహించిన సమావేశాలపై విజయవాడకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు దేవినేని అవినాష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2024 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరంలో వల్లభనేని వంశీ, విజయవాడ ఈస్ట్‌లో తనను ఓడిస్తామంటూ దేవినేని ఉమా మహేశ్వరరావు, రావి వెంకటేశ్వర రావు తొడ గొట్టి సవాల్ విసరడం పట్ల సెటైర్లు సంధించారు.
విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ నాయకులు తొడలు కొట్టుకోవడానికే తప్ప దేనికీ పనికి రారని ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలు లంచ్ మీటింగులు పెట్టుకుని, తొడలు కొట్టడం ద్వారా తమ పార్టీని ఓడించలేరని తేల్చి చెప్పారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పడం వల్లే వారంతా ఇలా లంచ్ మీటింగులు పెట్టుకుని శపథాలు చేశారని చురకలు అంటించారు. తాము ఓడిపోతామని తెలిసే- మీటింగులకు టీడీపీ నేతలు దూరంగా ఉంటోన్నారని అన్నారు.

శపథాలు చేసి, తొడలు కొట్టిన నాయకులకు మరోసారి గెలిచే సత్తా ఉందా? అని దేవినేని అవినాష్ ప్రశ్నించారు. తమ పార్టీపై దుమ్మెత్తిపోయాలనుకుని ప్రయత్నించి- చివరికి వారే బొక్కబోర్లా పడ్డారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఉదంతాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. గద్దె రామ్మోహన్ గాన, దేవినేని ఉమా మహేశ్వర రావు గానీ ముందుగా తమ పార్టీలో లోపాలను సరి చేసుకోవాలని హితవు పలికారు.
తెలుగుదేశం పార్టీ మహిళా నాయకుల వాయిస్ రికార్డులన్నీ తమ వద్ద ఉన్నాయని దేవినేని అవినాష్ అన్నారు. టీడీపీ నుంచి వెళ్లిపోయిన ప్రతి మహిళ నాయకులు కూడా పార్టీ అగ్రనాయకత్వంపై ఘాటు విమర్శలు చేసి వెళ్లినవారేనని గుర్తు చేశారు. దివ్యవాణి, పాలేటి కృష్ణవేణి.. ఏ కారణంతో టీడీపీకి గుడ్‌బై చెప్పారో అందరికీ తెలుసునని అన్నారు. బహిరంగంగా వారు పార్టీని విమర్శించారని, ఆ బురదను కడుక్కోవాలని చెప్పారు.












Click it and Unblock the Notifications