ఒకపక్క కరోనా విలయ తాండవం .. మరోపక్క నాలుగేళ్ళ బాలికపై వృద్ధుడి అత్యాచారం

ఒక పక్క కరోనా వైరస్ మహమ్మారి ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నా మృగాళ్ళు మాత్రం మారటం లేదు . బాలికా సంరక్షణ చట్టాలు ఎన్ని ఉన్నా, కామాంధులకు ఉరి శిక్ష వేసినా, నిర్భయ వంటి కఠిన చట్టాలు అమలవుతున్నా సరే అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. దేశం విపత్కర పరిస్థితుల్లో ఉన్నా అవేవీ పట్టనట్టు మానవ మృగాలు రెచ్చిపోతున్నారు. అభం శుభం తెలియని పసి వాళ్ళను చిదిమేస్తున్నారు. ఇక అలాంటి ఘటనే విశాఖ‌ప‌ట్నం జిల్లాలో వెలుగు చూసింది.

ఒక పక్క కరోనా భయపెడుతున్నా ఏం భయం లేకుండా ఓ వృద్ధుడు చేసిన పని అందర్నీ నివ్వెర పోయేలా చేస్తుంది . అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన సమాజాన్ని షాక్ కు గురి చేస్తుంది. ఒకపక్క కరోనా విలయ తాండవం చేస్తుంటే మరోపక్క అవేవీ పట్టనట్టు అత్యాచారాలు చేస్తున్న ఘటనలు అందరినీ విస్తుపోయేలా చేస్తున్నాయి. ఇక ఈ అత్యాచార ఉదంతాన్ని చూస్తే విశాఖ మ‌న్యం హుకుంపేట మండలం కొట్నాపల్లి పంచాయతీ గొందివలసలో జరిగిన దారుణంలో అదే గ్రామానికి చెందిన గెడ్డంగి కొండబాబు అనే 60 ఏళ్ల వ్య‌క్తి అత‌ని ఇంటి పక్కనే ఉండే నాలుగేళ్ల చిన్నారిని మిఠాయి కొనిస్తానని నమ్మించి శుక్రవారం బయటకు తీసుకెళ్లాడు.

An old man raped four year old girl even in corona virus tension

ఎవరూ లేకుండా చూసి ఇంటి వెనుకాలే ఉండే చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కూతురు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతుకుతున్న తల్లికి బాలిక ఏడుపు వినిపించింది. దీంతో ఆమె అటువైపునకు వెళ్లి చూడగా రక్తస్రావంతో కూతురు కనిపించింది. ఇక వృద్ధుడు చేసిన ఘాతుకాన్ని అర్ధం చేసుకున్న తల్లి ఆగ్రహంతో వృద్ధుడిని చితకబాదింది. కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు కూడా క‌లిసి కామాంధుడికి దేహ‌శుద్ధి చేసి పోలీసులకు అప్ప‌గించారు. ఇలాంటి వారికి కఠిన శిక్షలు వెయ్యాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు .ఒకపక్క ప్రపంచం కరోనా టెన్షన్ లో ఉంటే వృద్ధుడు చేసిన పనికి ఊరంతా తిట్టిపోస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+