రుషికొండ తవ్వకాలపై ఏదో దాస్తున్నారు ! జగన్ సర్కార్ పై హైకోర్టు వ్యాఖ్య..

ఏపీ కార్యనిర్వాహక రాజధానిగా వైసీపీ సర్కార్ ప్రతిపాదిస్తున్న విశాఖపట్నంలోని రుషికొండపై జరుపుతున్న తవ్వకాల వ్యవహారం మరోసారి హైకోర్టు ముందుకు వచ్చింది. ఇవాళ దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వంపై అనుమానాలు వ్యక్తంచేసింది. ముఖ్యంగా రుషికొండపై గతంలో అనుమతిచ్చిన దానికి భిన్నంగా తవ్వకాలు జరుపుతున్నారన్న అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది.

రుషికొండపై గతంలో 9.2 ఎకరాల్లో తవ్వకాలు జరిపేందుకు అనుమతి ఇవ్వగా.. ప్రభుత్వం మాత్రం 20 ఎకరాలు తవ్వేసిందని పిటిషనర్ అయిన టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీనికి సాక్ష్యంగా తాజా గూగుల్ మ్యాప్ లను సమర్పించారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ అటవీశాఖ దీనిపై కమిటీ నియమించేందుకు ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. దీనిపై స్పందించిన హైకోర్టు ప్రభుత్వ తీరుపై అనుమానాలు వ్యక్తం చేసింది.

ap high court suspect jagan regime hiding something on rushikonda hill digging in vizag

రుషికొండపై జరుపుతున్న తవ్వకాలకు సంబంధించి ప్రభుత్వం ఏదో దాస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. రుషికొండ తవ్వకాలపై కేంద్రం కమిటీ వేస్తానంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రభుత్వాన్నిప్రశ్నించింది. అలాగే గూగుల్ మ్యాప్ లపై స్పందిస్తూ.. ఫొటోలు అబద్ధం చెబుతాయా అని హైకోర్టు నిలదీసింది. దీంతో ప్రభుత్వ న్యాయవాది నిరంజన్ రెడ్డి ఇరుకునపడ్డారు. చివరికి దీనిపై వివరణ ఇచ్చేందుకు గడువు కావాలని హైకోర్టును ఆయన కోరారు. దీంతో విచారణను నవంబర్ 3కు వాయిదా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+