నూతన్ నాయుడు భార్య ప్రియా మాధురిపై చీటింగ్ కేసు: శిరోముండనం కేసులో బెయిల్ వచ్చిన కాసేపటికే అరెస్ట్
దళిత యువకుడి శిరోముండనం కేసులో సినీ నిర్మాత, జనసేన పార్టీ నేత నూతన్ నాయుడు భార్య ప్రియా మాధురి ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ కేసులో బెయిల్ పై నిన్న విడుదలైన నూతన్ నాయుడు భార్య సుప్రియ మాధురిని పోలీసులు ఆమె విడుదలైన కాసేపటికే అరెస్ట్ చేశారు. బెయిల్ పై విడుదలైన కొద్ది గంటల్లోనే పోలీసులు మళ్ళీ ఆమెను అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.

ఉద్యోగం ఇప్పిస్తానని నిరుద్యోగిని మోసం చేసిన నూతన్ నాయుడు భార్య
ఉద్యోగం ఇప్పిస్తానని నిరుద్యోగిని మోసం చేసిన కేసులో నూతన్ నాయుడు భార్య ప్రియా మాధురిని పోలీసులు అరెస్టు చేశారు. విశాఖలోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నూతన్ నాయుడు దంపతులు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ యువకుడు వద్ద 25 లక్షల రూపాయలు వసూలు చేశారు. ఉద్యోగం కోసం రెండేళ్లుగా ఆ యువకుడు నూతన్ నాయుడు దంపతుల చుట్టూ తిరుగుతున్నారు. పలుమార్లు ప్రియ మాధురిని ఉద్యోగం గురించి అడిగినా పట్టించుకోలేదు. తన దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరినా వారు ఇవ్వలేదు.

చీటింగ్ కేసులో ఈ నెల 20 వరకు రిమాండ్
కొద్ది రోజుల క్రితం, నూతన్ నాయుడు ఇంట్లో శిరోముండనం ఘటన వెలుగు చూసిన తర్వాత బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. నూతన్ నాయుడు దంపతులు చేసిన చీటింగ్ ను బయట పెట్టాడు .నూతన్ నాయుడు దంపతులు తనను మోసం చేశారని ఫిర్యాదు చేశారు. దీంతో పెందుర్తి పోలీసులు నూతన్ నాయుడు దంపతులపై చీటింగ్ కేసు నమోదు చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే ఆ చీటింగ్ కేసులో నూతన్ నాయుడు భార్య ప్రియా మాధురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్ విధించింది.

శిరోముండనం కేసులో బెయిల్ వచ్చిన కొద్దిసేపటికే .. మళ్ళీ అరెస్ట్
తమ ఇంట్లో పని చేసి మానేసిన దళిత యువకుడు సెల్ ఫోన్ దొంగతనం చేశాడని ఇంటికి పిలిచి అతనికి శిరో ముండనం చేయించిన నూతన్ నాయుడు భార్య , ఆమెకు సహకరించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో నూతన్ నాయుడుపై కూడా కేసు నమోదు అయ్యింది . ఈ దారుణం వెలుగు చూడగానే పోలీసులు నూతన్ నాయుడు భార్య మధు ప్రియ తో పాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేశారు. సెక్షన్ 307, 342, 324,323,506 r/w34ipc 3(1) b ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే .ఈ ఘటనతో నూతన్ నాయుడుపై కూడా అనేక కేసులు నమోదయ్యాయి . పలు చీటింగ్ వ్యవహారాలూ వెలుగులోకి వచ్చాయి. ఇక ఈ నేపధ్యంలో తాజాగా ఆమెకు బెయిల్ వచ్చిన కొద్ది సేపటికే నూతన్ నాయుడు భార్యపై చీటింగ్ కేసు కూడా నమోదైంది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications