విశాఖపట్నం పోర్టు నౌకలో అగ్ని ప్రమాదం: ఇంజిన్‌లో మంటలు
విశాఖపట్నం: పోర్టు ట్రస్టులోని ఓ నౌకలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెస్ట్ క్యూ ఫైవ్ బెర్త్‌లో ఆగిన నౌక ఇంజిన్ రూమ్ నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. వెంటనే గమనించిన సిబ్బంది అప్రమత్తమయ్యారు. మంటలను అదుపులో చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు.
ఇంజిన్ రూమ్ కావడంతో గ్యాస్ మాస్కు ధరించి మంటలు ఆర్పివేశారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని పోర్టు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. కోస్టల్ షిప్పింగ్ బోట్‌లో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగిందని తెలిపారు.

అయితే, ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడించారు. స్వల్ప ప్రమాదమేనని, ఆస్తి నష్టం కూడా పెద్దగా జరగలేదని తెలిపారు. కాగా, చెన్నై నుంచి బీడీ 51 నౌక శనివారం రాత్రి విశాఖ పోర్టుకు చేరుకుందని తెలిపారు. నౌకల్లోకి సిబ్బంది మార్చేందుకు కోస్టల్ షిప్‌ను వినియోగిస్తారని చెప్పారు.
Recommended Video
విశాఖపట్నంలో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతుండటంతో నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు పరిశ్రమల్లో భారీ అగ్ని ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాని పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications