విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖకు సచివాలయం తరలింపు ముహూర్తం ఫిక్స్: ఏప్రిల్ 6వ తేదీ డెడ్ లైన్: ఉద్యోగులకు మౌఖిక ఆదేశాలు..!

|
Google Oneindia TeluguNews

రాజధాని తరలింపు ఇంకా ప్రతిపాదనల స్థాయిలోనే ఉంది. అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు. మరో వైపు రాజధాని తరలింపు ప్రతిపాదనల పైన అమరావతిలలో ఆందోళనలు. అభ్యంతం వ్యక్తం చేస్తున్న రాజ కీయ పార్టీలు. జేఏసీ గా ఏర్పడి నిరసనలు. కేంద్రం చూస్తూ ఊరుకోదంటూ బీజేపీ నేతల హెచ్చరికలు. జీఎన్ రావు కమిటీ..బోస్టన్ కమిటీ అధ్యయనం కోసం హైపవర్ కమిటీ ఏర్పాటు. ఆ కమిటీ ఇచ్చే నివేదిక పైన ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశమై తుది నిర్ణయం...ఇదీ ఇప్పటి వరకు ప్రభుత్వ వర్గాల నుండి అందుతున్న సమచారం మేరకు రాజధాని తరలింపు పైన కార్యాచరణ. కానీ, ప్రభుత్వం అంతర్గతంగా తన పని తాను చేసుకుంటూ పోతోంది. సచివాలయ తరలింపు పైన స్పష్టత ఇచ్చేసింది. ఇందుకు మూహూర్తం సైతం ఫిక్స్ చేసింది.

రాజధాని తరలింపు కార్యాచరణ ఫిక్స్ : రేపు బీసీజీ నివేదిక: అసెంబ్లీలో నిర్ణయం..కానీ కోర్టులో..!రాజధాని తరలింపు కార్యాచరణ ఫిక్స్ : రేపు బీసీజీ నివేదిక: అసెంబ్లీలో నిర్ణయం..కానీ కోర్టులో..!

సచివాలయం తరలింపు ముహూర్తం ఇదే..

సచివాలయం తరలింపు ముహూర్తం ఇదే..

రాజధాని తరలింపు పైన అధికారికంగా అసెంబ్లీ ఆమోదం..ప్రభుత్వం నిర్ణయం జరగకుండానే సచివాలయ తరలింపు కోసం ప్రభుత్వం ముమూర్తం ఫిక్స్ చేసింది. ఉద్యోగులను తరలింపుకు మానసికంగా సిద్దం చేసేందుకు ముందుగానే ముహూర్తం గురించి వారికి సూత్రప్రాయంగా సమాచారం అందించారు. వచ్చే ఏప్రిల్ 6వ తేదీని విశాఖకు సచివాలయం తరలింపుకు ముహూర్తంగా చెబుతున్నారు. ఆలోగా అక్కడ సచి వాలయం ఏర్పాటుకు కావాల్సిన అన్ని వసతులు సిద్దం చేస్తామని..అదే విధంగా ఉద్యోగుల వసతి ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ మేరకు అసెంబ్లీలో రాజధాని తరలింపు నిర్ణయానికి అధికారికం గా ఆమోద ముద్ర వేసిన తరువాతనే ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.

మౌఖిక ఆదేశాల ద్వారా సమాయత్తం

మౌఖిక ఆదేశాల ద్వారా సమాయత్తం

రాజధాని తరలింపు పైన హైపవర్ కమిటీ నివేదిక..ఆ తరువాత కేబినెట్ ఆమోదం..చివరగా అసెంబ్లీలో ఆమోదించిన తరువాతనే ప్రభుత్వం అధికారికంగా తరలింపు వ్యవహారంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ లోగా ఏది చేసినా..మరింతగా వివాదాస్పదమయ్యే అవకాశం ఉంది. దీంతో..ఉద్యోగ సంఘాల నేతలకు ప్రభుత్వంలోకి కొందరు ముఖ్యుల ద్వారా మౌఖిక ఆదేశాలు అందిస్తున్నారు. ఏప్రిల్ 6 వ తేదీ లోగా విశాఖ కు తరలి వెళ్లాల్సి ఉంటుందనది..ఆ దిశగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. హైదరాబాద్ నుండి వచ్చిన సమయంలో అమరావతిలో ఉద్యోగులకు ఏ రకంగా వసతి కల్పించారో అదే విధంగా ఏర్పాట్లు చేయటానికి ప్రభుత్వం సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే, తరలింపు పైన అధికారికంగా ఆమోదం పొందిన తరువాత దీని పైన ప్రభుత్వం నేరుగా ఉద్యోగులతో సంప్రదింపులు జరిపి..వారికి ఏరకమైన ఏర్పాట్లు చేసేదీ వివరించనుంది.

 ఉద్యోగులకు మానసిక సిద్దం చేసే క్రమంలో..

ఉద్యోగులకు మానసిక సిద్దం చేసే క్రమంలో..

ఈ నెల మూడో వారంలో రాజధాని తరలింపు అంశం పైన అసెంబ్లీ సమావేశం కానుంది. ఆ సమావేశంలో ప్రభుత్వం తమ ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయం ఉంటుందని అంచనా వేస్తోంది. దీంతో.. ముందు గానే విశాఖలో సచివాలయం ఎక్కడ ఏర్పాటు చేయాలో ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక, కీలకమైన సచివాలయ ఉద్యోగుల నుండి అభ్యంతరాలు..అనుమానాలు లేకుండా వారిని ముందుగానే మానసికంగా సంసిద్దులను చేసే బాధ్యత ప్రభుత్వం కొందరికి అప్పగించంది. ఉద్యోగులకు వసతి పరంగా ఇబ్బంది లేదని ప్రభుత్వం చెబుతున్నట్లు సమాచారం. ఇక, ఇప్పటికే కొందరు ఉద్యగులు ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకుంటే తప్పదనే ఉద్దేశంతో ఉండగా..తాము హైదరాబాద్ లో ఫ్యామిలీలు ఉంచి..అమారవతి లో ఉద్యోగాలు చేస్తున్నామని..విశాఖకు వెళ్లటం ద్వారా మరింతగా ఇబ్బందులు పడతా మనే ఆవేదన అంతర్గతంగా వ్యక్తం చేస్తున్నారు.

English summary
AP Govt hinting the Sectretariat employees to prepare for shifting to Vizag by April 6th. By end of this month govt planning to complete official process in three capital issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X