• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ప్రణయ్ ను మర్చిపో .. ఇష్టం అయితే పెళ్లికి రెడీ అని అమృతకు లేఖ రాసిన బొబ్బిలి యువకుడు

|

మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన ప్రణయ్ ఉదంతం అందరికీ తెలిసిందే. ప్రణయ్ అమృత ల విషాదాంత మైన ప్రేమ గాధ అంతర్జాతీయ సమాజాన్ని సైతం కదిలించిన విషయం తెలిసిందే. వాషింగ్టన్ డి.సి లో ప్రధానంగా వీరి ప్రేమకథ ప్రచురితమైంది. ప్రస్తుతం అమృతకు వారిద్దరి ప్రేమ గుర్తుగా బాబు పుట్టాడు. ఆ బాబును చూసుకుంటూ అమృత జీవనం సాగిస్తోంది.

సీఎం జగన్ హెలికాఫ్టర్ ల్యాండింగ్ వివాదంలో ఏడుగురు అధికారులకు నోటీసులు జారీ

ఒక పక్క తన భర్తను హతమార్చి, తన జీవితాన్ని నాశనం చేసిన తండ్రిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న అమృత తన తండ్రి మారుతీరావును ఉరి తియ్యాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ప్రణయ్ జ్ఞాపకాల నుండి బయటపడని అమృతకు ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది.ప్రణయ్ ని మర్చిపో.. నువ్వు ఓకే అంటే పెళ్లి చేసుకుంటా అంటూ ఒక యువకుడు అమృత కు లేఖ రాసి ఆ లేఖ ఉన్న పోస్ట్ కవర్ ను ఇంటివద్ద గేట్ వద్ద పెట్టి వెళ్లిపోయాడు. అందులో అతని అడ్రస్, ఫోటోలు పెట్టి మరి వెళ్ళాడు.

Marriage proposal to amrutha .. Bobbili young man wrote a letter to amrutha

ఎవరూ లేని సమయంలో అమృత ఇంటికి వచ్చిన బొబ్బిలికి చెందిన యువకుడు పెట్టి వెళ్లిన లేఖలో అతని కలర్‌ ఫోటో, తన శరీర కొలతల వివరాలు ఉన్నాయి. అతని పుట్టిన తేది, ఫోన్‌ నెంబర్‌, ఇతర వివరాలు కూడా లేఖలో రాసి ఉన్నాయి. ఇక ఈ లేఖను చూసిన అమృత అత్తమామలు అమృతను వేధింపులకు గురిచేస్తున్నారని, ఒక వ్యక్తి పెళ్లిచేసుకోమని అమృతకు లేఖ రాశారని ఆ లేఖను ఇచ్చి ఫిర్యాదు చేశారు. అయితే అతను నిజంగానే అమృతను వివాహం చేసుకోవాలని భావించి అలా లేఖ రాశారా ? లేకా మరేదైనా కారణం ఉందా అన్న అనుమానాలు సైతం ప్రణయ్ కుటుంబ సభ్యుల నుండి వ్యక్తం అవుతున్నాయి.

ఇక సీసీ కెమెరా పుటేజీలో ఆ యువకుడు గేటు తీసి లోపలికి వచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి లేఖను పెట్టి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అయితే విజయనగరం జిల్లా బొబ్బిలి నుండి వచ్చిన ఆ యువకుడు ఎవరు? ఎందుకు ఆ వ్యక్తి లేఖను పెట్టి వెళ్లాడు? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒకపక్క అమృతకు తండ్రి మారుతీ రావు తో ప్రాణహాని ఉందని భావిస్తున్న నేపథ్యంలో పెళ్లి చేసుకుంటానని లేఖ రాసిన సదరు యువకుడు పై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అతనిని అరెస్ట్ చేసి పోలీసులు విచారణ జరపనున్నారు.

English summary
Forget about Pranay ..If you are okay will get marry . .. An unknown person put his address and photos and his details in a letter . Amrita's mother-in-law, seen the letter from Bobbili's young man, who had come to Amrita's house when no one at home , complained that Amrutha was molesting and that a man had written a letter to Amrutha to marry her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more