విడుదల చేయకుంటే స్టేషన్ కు వస్తా - విశాఖలో పవన్ కు నీరాజనం..!!

విశాఖ కేంద్రంగా జనసేనానికి భారీ స్వాగతం లభించింది. విశాఖ గర్జన నాడే పవన్ కళ్యాణ్ రావటం పైన రాజకీయంగా విమర్శలు రావటంతో..జనసేన ఈ పర్యటనను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. భారీ ర్యాలీకి ఏర్పాట్లు చేసింది. విశాఖ విమానాశ్రయంకు చేరుకున్న పవన్ కు పార్టీ నేతలు - అభిమానులు భారీ సంఖ్యలో స్వాగతం పలికారు. అక్కడ నుంచి ర్యాలీగా పవన్ కళ్యాణ్ బస చేసిన హోటల్ వరకు దాదాపు 15 కిలో మీటర్ల ప్రదర్శన నిర్వహించారు. అభిమానులు భారీ సంఖ్యలో ఆయన్ను అనుసరిస్తూ అనుకూల నినాదాలు చేసారు.

భారీగా తరలివచ్చిన అభిమానులు
పవన్ ప్రయాణిస్తున్న దారిలో మధ్యలో వీధి దీపాలు ఆగిపోవటం విమర్శలకు కారణం అయింది. కారు పైన నిలబడి అందరికీ అభివాదం చేసుకుంటూ పవన్ ముందుకు సాగారు. పవన్ వాహనం పైన నిలబడటం పైన పోలీసులు ఆయనతో మాట్లాడారు. వాహనం పైన వద్దని సూచించారు. ఆ తరువాత పవన్ నోవాటెల్ హోటల్ కు చేరొకని అక్కడ బస చేసారు. ఈ రోజు ఆయన పోర్టు కళావాహిణి స్టేడియంలో జనవాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. ఇక, విశాఖ గర్జన ముగించుకొని తిరిగి వెళ్తున్న మంత్రుల కార్ల పైన విశాఖ విమానాశ్రయం వద్ద దాడి జరిగింది. దీని పైన సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసు అధికారులు దాడికి యత్నించిన వారి పైన 307 సెక్షన్ తో సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు.

Pawan Kalyan demands to release Party leaders immediately to taken in to custody in Vizag

మంత్రుల కార్లపై దాడి - కేసులు
మంత్రులు విమానాశ్రయం చేరుకున్న సమయంలో వారి కార్ల పైన రాళ్లు ..కర్రలతో దాడి చేసి దూషించినట్లుగా చెబుతున్నారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం జరిగినట్లుగా కేసు నమోదు అయింది. దీంతో..సీసీ టీవీ ఫుటేజ్ ఆధారాలతో రాత్రి పొద్దు పోయిన తరువాత విశాఖ పోలీసులు పవన్ కళ్యాణ్ బస చేసిన హోటల్ వద్దకు వెళ్లారు. అక్కడ తమ పార్టీకి చెందిన ఇద్దరు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని జనసేన నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ వరుసగా ట్వీట్లు చేసారు.

Pawan Kalyan demands to release Party leaders immediately to taken in to custody in Vizag

విడుదల చేయాలని డిమాండ్
పోలీసులు అరెస్ట్ చేసిన జనసేన నేతలను వెంటనే విడుదల చేయాలని కోరారు. లేకుంటే స్టేషన్ కు వచ్చి వారికి సంఘీభావం ప్రకటిస్తానని పేర్కొన్నారు. జనసేన పార్టీ పోలీసు శాఖను ఎప్పుడూ గౌరవిస్తుందని, అనవసరంగా అరెస్ట్ చేసిన తమ పార్టీ నేతలను వెంటనే విడుదల చేయాలని డీజీపీని కోరుతున్నాను అంటూ మరో ట్వీట్ చేసారు. ఈ రోజు, రేపు జనసేనాని ఉత్తరాంధ్రలోనే పర్యటించనున్నారు. ఇప్పుడు మంత్రుల పైన దాడి.. పవన్ పర్యటన నేపథ్యంలో ఎటువంటి ఉద్రిక్తతల కు అవకాశం లేకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+