అంపశయ్యపై టీడీపీ.. జనం సమాధి చేస్తారు: తమ్మినేని సీతారాం

రాజధానుల అంశంపై ఏపీలో అధికార- విపక్షాల మధ్య డైలాగ్ వార్ జరుగుతూనే ఉంది. చంద్రబాబు లక్ష్యంగా వైసీపీ నేతలు, మంత్రులు కౌంటర్ అటాక్ చేస్తూనే ఉన్నారు. ఇవాళ స్పీకర్ తమ్మినేని సీతారాం విరుచుకుపడ్డారు. ఆయనకు ప్రస్టేషన్ పట్టుకుందని.. అందుకే అలా చేస్తున్నారని ఫైరయ్యారు. సీఎం జగన్ నేతృత్వంలో సమన్యాయ పాలన జరుగుతుందని వివరించారు.

చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాల్లో చేసిన వ్యాఖ్యలే అతని ప్రస్టేషన్‌కు నిదర్శనం అని పేర్కొన్నారు. పాలన వికేంద్రీకరణపై సీఎం జగన్ పూర్తి స్పష్టతతో ఉన్నారని తమ్మినేని సీతారం గుర్తుచేశారు. కావాలనే ఆరోపణలు చేయడం మాత్రం సరికాదని హితవు పలికారు. ప్రజల బాగు కోసం ఆలోచించి.. కంకణబద్దులమై పనిచేస్తున్నామని తెలిపారు.

tammineni sitharam fires on chandrababu naidu

అమరావతిని శాసన రాజధానిగా, విశాఖపట్టణం పాలన రాజధానిగా ప్రకటిస్తారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే రామారావు గుర్తుకొచ్చే చంద్రబాబుకు ఆయన గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. ఎన్టీఆర్‌ను చంద్రబాబు ఇప్పటికీ ఓటుబ్యాంకుగానే పరిగణిస్తున్నారని తెలిపారు. అంపశయం మీదున్న టీడీపీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలు సమాధి చేస్తారని జోస్యం చెప్పారు. భవిష్యత్‌లో
చంద్రబాబుకు మహిళల నుంచి ప్రతిఘటన తప్పదని తమ్మినేని సీతారాం జోస్యం చెప్పారు.

చంద్రబాబు గతంలో అన్నీ వర్గాలను మోసం చేశారని వివరించారు. ఆ వంచన ఇప్పటికీ వారు మరవరని తెలిపారు. అందుకే ఆయన లేని పోని ఆరోపణలు చేస్తుంటారని ఫైరయ్యారు. కానీ జనం నిజం ఏంటో అబద్దం ఏంటో ఈజీగా గుర్తిస్తారని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+