భార్య చనిపోవడంతో కూతురుతోనే... నాలుగు నెలల గర్భం- విశాఖలో కీచక తండ్రిపై దిశ కేసు..
ఏపీలో నిర్భయ, దిశ చట్టం అమల్లో ఉన్నా మహిళలు, చిన్నపిల్లలపై అకృత్యాలు మాత్రం ఆగడం లేదు. కఠిన చట్టాలని ప్రభుత్వాలు చెబుతున్నా వీటికి కీచకులు ఏ మాత్రం భయపడటం లేదు. వావీ వరుసలు మర్చిపోయి మరీ కుటుంబ సభ్యులపైనే ఆగడాలకు దిగుతున్నారు. ఇదే కోవలో విశాఖలో చోటు చేసుకున్న ఓ ఉదంతం స్ధానిక పోలీసులను నిర్గాంత పరిచింది. కన్న కుమార్తెపై వావీ వరుసలు మర్చిపోయి ఐదునెలలుగా అత్యాచారానికి పాల్పడిన కసాయి తండ్రిని అరెస్టు చేసిన పోలీసులు దిశ చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.

కన్న కూతురిపై కాటేసిన తండ్రి...
ఏపీ ప్రభుత్వం కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన విశాఖ నగరంలో మహిళలు, చిన్నారుల భద్రతను ప్రశ్నార్ధకం చేసే ఘటన తాజాగా చోటు చేసుకుంది. విశాఖ న్యూ రైల్వే కాలనీలో కన్నకూతురిపై కనికరం లేకుండా ఐదు నెలలుగా తండ్రే అత్యాచారానికి పాల్పడిన ఘటన స్ధానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇంత జరుగుతున్నా కుటుంబంలోని ఇతర సభ్యులకు కానీ, స్ధానికులకు కానీ తెలియకపోవడం ఇక్కడ మరో విశేషం. 14 సంవత్సరాల వయసున్న కన్న కూతురిపై కన్నేసిన ఆ కసాయి తండ్రి చేసిన పనితో ఆమె గర్భవతి అయింది. హఠాత్తుగా అస్వస్ధతకు గురి కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలిస్తే అసలు విషయం బయటపడింది.

భార్య చనిపోవడంతో కూతురిపై కన్ను..
విశాఖ న్యూ రైల్వే కాలనీలో బాధిత బాలిక, తండ్రి, నానమ్మ, తాతయ్యతో కలిసి ఉంటోంది. తల్లి ఇటీవలే చనిపోయింది. దీంతో కొన్నాళ్లు వేచి చూసి బాలికకు మాయమాటలు చెప్పి తండ్రి లోబరుచుకున్నాడు. తరచుగా అత్యాచారానికి పాల్పడేవాడు. మొదట్లో వ్యతిరేకించిన బాలిక ఆ తర్వాత మాటమాటలకు లొంగిపోయింది. చివరకు ఓ రోజు ఆస్వస్ధతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు అమె నాలుగు నెలల గర్భవతిగా తేల్చారు. నిందితుడిని నిలదీస్తే నిజం అంగీకరించాడు. దీంతో దేహశుద్ధి చేసి స్ధానికులు పోలీసులకుఅప్పగించారు.

ఎవరికీ అనుమానం రాకుండా...
కుమార్తెపై ఐదు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్న కామాంధుడు ఎవరి కంట పడకుండా తన పని కానించేవాడని తెలుస్తోంది. ఒకే ఇంట్లోనే ఉండటంతో తన తల్లి తండ్రులకు సైతం అనుమానం రాలేదు. ఇదే అదనుగా ఎప్పుడు పడితే అప్పుడు అనుభవించేవాడు. బాలిక కూడా ప్రతిఘటించకపోవడంతో అడ్డూ అదుపూ లేకుండా పోయింది. బయటి వారికి ఎలాగో తెలియదు. దీంతో ఐదు నెలలుగా సాగిన ఈ తంతు.. బాలిక అనారోగ్యంతో ఒక్కసారిగా బయటపడింది. పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేసి దిశ చట్టం కింద కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications