• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మనిషి పుర్రెను కాల్చుకుని - విశాఖలో సైకో రాజు కలకలం - అతని ఇంట్లో ఓ యువతి..

|
Google Oneindia TeluguNews

చిన్నప్పటి నుంచే వ్యసనాలకు బానిసయ్యాడు.. ప్రస్తుతం సైకోగా రూపాంతరం చెందాడు.. ఐదేళ్ల కిందటే తండ్రి మరణించాడు.. కొడుకు అకృత్యాలు చూడలేక తల్లి ఇల్లొదిలేసి వెళ్లిపోయింది.. దాదాపుగా పాడుబడ్డ ఆ ఇంట్లో అతను సాగిస్తోన్న వ్యవహారాలు గగుర్పొడిచేలా ఉన్నాయి.. నిత్యం మత్తులో జోగే ఆ యువకుడు.. స్మశానాల్లో తిరుగుతూ పూడ్చిపెట్టిన శవాలను తోడేసేవాడని తెలుస్తోంది..

హెచ్1బీ వీసా, గ్రీన్ కార్డులపై బిడెన్ హామీ - చైనాతో పోరులో భారత్‌కు సహకారం - కమలతో కలిసి ప్రసంగంహెచ్1బీ వీసా, గ్రీన్ కార్డులపై బిడెన్ హామీ - చైనాతో పోరులో భారత్‌కు సహకారం - కమలతో కలిసి ప్రసంగం

రెల్లివీధిలో కలకలం..

రెల్లివీధిలో కలకలం..

విశాఖపట్నం సిటీ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల రెల్లివీధిలో ఆదివారం ఒక్కసారిగా కలకలం చెలరేగింది. అక్కడ ఓ పాడుబడ్డ ఇంట్లో యువకుడు.. మనిషి పుర్రెను కాల్చుకుని తినేందుకు ప్రయత్నించిన ఘటన సంచలనంగా మారింది. ఈ అనూహ్య చర్యకు పాల్పడిన వ్యక్తిని రావులపూడి రాజు (20) అలియాస్ సైకో రాజుగా గుర్తించారు. పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం..

సంచిలో మనిషి తల..

సంచిలో మనిషి తల..

స్థానిక రెల్లివీధిలో నివసించే సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి తన ఇంటిపక్కనే ఉన్న సందులో ఒక గోనె సంచిని చూశాడు. అనుమానంతో దాన్ని తెరిచి చూడగా.. అందులో మనిషి తల కనిపించింది. షాక్ కు గురైన సుబ్రహ్మణ్యం పెద్దగా కేకలు వేసి, అందరినీ పిలిచాడు. ఇది పక్కనే పాడుబడ్డ ఇంట్లో ఉండే రాజు పనే అనే అనుమానంతో నిలదీయగా.. రాజు దర్జాగా బయటికొచ్చి.. ఆ గోనె సంచిలోని తలను తీసుకుని వెళ్లాడు. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈలోపే..

మోదీ పిరికితనమే చైనాకు బలం - మన ఆర్మీపై ప్రధానికి నమ్మకం లేదు - రాహుల్ గాంధీ ఫైర్మోదీ పిరికితనమే చైనాకు బలం - మన ఆర్మీపై ప్రధానికి నమ్మకం లేదు - రాహుల్ గాంధీ ఫైర్

స్థానికులు ఏం చెప్పారంటే..

స్థానికులు ఏం చెప్పారంటే..

సంచిలోని మనిషి పుర్రెను కాల్చుకుతినేందుకు సైకో రాజు ప్రయత్నించాడని, అతణ్ని పట్టుకునేందుకు తాము చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, పోలీసులు ఘటనా స్థలికి వచ్చేలోపే రాజు పరారయ్యాడని స్థానికులు చెప్పారు. రాజు తండ్రి ఐదేళ్ల కిందట అనారోగ్యంతో చనిపోయాడని, కొడుకుతో వేగలేక తల్లి ఎలమాచి ఇంట్లో నుంచి వెళ్లి పోయి వేరుగా ఉంటోందని, చెడు వ్యసనాలకు బానిసైన రాజు తరచూ దొంగతనాలు చేస్తూ, శ్మశానాల్లో తిరిగేవాడని తెలిపారు.

ఆ యువతి ఎవరు?

ఆ యువతి ఎవరు?

స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకోగా, అప్పటికే రాజు పారిపోయాడు. అయితే దాదాపుగా పాడుబడ్డ అతని ఇంటిని సోదా చేయగా, పుర్రెతోపాటు ఓ యువతిని కూడా గుర్తించారు. ఆమె ఎవరు? రాజుతో కలిసి ఎందుకు ఉందనే వివరాలు తెలియాల్సి ఉంది. ఆ పుర్రె దగ్గర్లోని స్మశానం నుంచి తెచ్చిందా? లేక రాజు హత్యలకు పాల్పడ్డాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని, యువతిని అదుపులోకి తీసుకున్నట్లు వన్ టౌన్ పోలీసులు చెప్పారు.

English summary
Tension flared up in Visakhapatnam after a psycho found eating human skull and the news triggered panic among the locals. According to the sources, a psycho identified as Raju resident of Rellivedi lost mental balance and used to take marijuana along with others during nights.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X