• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

విశాఖ లీకేజీ: జగన్‌తో ఎల్జీ టీమ్ భేటీ.. ఎయిర్‌పోర్టులోనే సీఎంకు వివరణ.. తర్వాతేంటి?

|

''అదేమో అంతర్గాతీయంగా పేరుపొందిన బడా కంపెనీ.. ఇటుచూస్తే చిన్నపిల్లల్ని సైతం పొట్టనపెట్టుకున్న దుర్ఘటన.. ప్రభుత్వం మానవాతా దృక్పథంతో మృతుల కుటుంబాలను ఆదుకోవడం మంచిదేగానీ.. దారుణానికి కారణమైన కార్పొరేట్ సంస్థపై కొరడా ఝుళిపిస్తారా? విషవాయు లీకైనా ఎల్జీ పాలిమర్ ప్లాంటును శాశ్వతంగా మూసేస్తారా?'' అంటూ కొద్ది గంటలుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. స్టెరీన్ గ్యాస్ లీకేజీ ఘటనలో ఇప్పటికే 11 మంది ప్రాణాలు కోల్పోగా, 200 మందికిపైగా వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో 80 మంది కండిషన్ క్రిటికల్ గా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగేఅవకాశముంది.

విశాఖలో అసలేం జరిగిందో తెలుసా? స్టెరీన్ గ్యాస్‌‌ను ఎందుకు వాడారు? రహస్యంగా సాగే హైడ్రామా ఇదే..

ఎయిర్ పోర్టులో కలిసి..

ఎయిర్ పోర్టులో కలిసి..

ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు దాని తీవ్రత కంటే కూడా ప్రభుత్వం స్పందించే తీరు ప్రజలపై ప్రభావం చూపుతుంది. గురువారం ఉదయం ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్ ప్లాంటులో స్టెరీన్ గ్యాస్ లీకైనట్లు తెలిసిన వెంటనే సీఎం జగన్ వేగంగా స్పందించడం, అప్పటికప్పుడు యంత్రాంగం మొత్తాన్ని మోహరింపజేయడం, తానే స్వయంగా విశాఖ వెళ్లి బాధితులకు భరోసా కల్పించడం, మృతుల కుటుంబాలకు రూ.1చోప్పున పరిహారం ప్రకటించడం తెలిసిందే. తిరుగు ప్రయాణంలో వైజాగ్ ఎయిర్ పోర్టులో ఆయనను ఎల్జీ పాలిమర్ కంపెనీ ప్రతినిధుల టీమ్ కలుసుకుంది.

అసలేం జరిగిందంటే..

అసలేం జరిగిందంటే..

విశాఖలోని ఆర్ఆర్ వెంకటాపురం వద్ద ఉన్న ప్లాంటు నుంచి గ్యాస్ లీక్ కావడానికి గల కారణాలను ఆ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. లాక్ డౌన్ కారణంగా ప్లాంట్ ను తాత్కాలికంగా నిలిపేశామని, తాజా సడలింపుల తర్వాత పున:ప్రారంభించేందుకు ప్రయత్నించే క్రమంలో ప్రమాదం చోటుచేసుకుందని, ట్యాంక్ నుంచి గ్యాస్ లీక్ అవుతున్నట్టు నైట్ షిఫ్ట్ లో ఉన్న ఓ కార్మికుడు గుర్తించాడని, వెంటనే తాము ఆ విషయాన్ని ప్రభుత్వాధికారులకు తెలియజేశామని ఎల్జీ ప్రతినిధులు వివరించారు.

తర్వాతేంటంటే..

తర్వాతేంటంటే..

స్టెరీన్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన తర్వాత ఆ కెమికల్ తీవ్రతను తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం గుజరాత్ నుంచి హుటాహుటిన 500 కేజీల పారా టెర్షియరీ బ్యుటైల్‌ క్యాటెకాల్‌ (పీటీబీసీ) రసాయనాన్ని తెప్పించి, వైజాగ్ ఎల్జీ ప్లాంట్, దాని పరిసర ప్రాంతాల్లో వాడుతున్నారు. నష్టనివారణ చర్యల్లో తాము కూడా పాలుపంచుకుంటామని ఎల్జీ ప్రతినిధులు సీఎంకు చెప్పినట్లు సమాచారం. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడం, ప్రధాని మోదీ సైతం స్పందించడంతో ఎల్జీ కంపెనీపై ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయనేది తేలాల్సిఉంది.

English summary
representatives of the LG Polymers, the company where toxic gas leaked, met andhra cm YS Jagan at the airport in Visakhapatnam on Thursday, and explained the reasons for the leakage of styrene gas from their chemical plant near RR Venkatapuram village.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X