వలకు చిక్కిన 2 టన్నుల చేప.. తర్వాత దాన్ని ఏం చేశారంటే..?
ప్రపంచంలోనే అతిపెద్ద చేప విశాఖ తీరానికి వచ్చింది. తంతడి బీచ్ లో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు వలకు చిక్కింది. దీంతో వారు దీనిని సముద్రం ఒడ్డుకు తీసుకువచ్చారు. దీనిని గమనించిన వైల్డ్ లైఫ్ ఫోటో గ్రాఫర్ మన్నెపూరి శ్రీకాంత్ జిల్లా అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అటు ఈ చేపను చూసేందుకు చుట్టు పక్కల ప్రజలు తరలివచ్చారు
Recommended Video

ప్రపంచంలోని అతిపెద్ద చేప ..
జిల్లా అటవీ అధికారి అనంత్ శంకర్ ఆదేశాలతో అధికారులు తంతడి బీచ్‌కి చేరుకుని చేపను పరిశీలించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద చేప అయిన వేల్ షార్క్‌గా గుర్తించారు. మత్స్యకారులు వలకి చిక్కిన ఈ చేప 50 అడుడుల పొడవు, సుమారు 2 టన్నుల బరువు ఉంది. ఇటీవల కాలంలో క్రమేనా అంతరించిపోతున్న షార్క్ జాతుల్లో ఇదొకటని వారు తెలిపారు. ఈ షార్క్ ను సురక్షితంగా సుముద్రంలోకి పంపేందుకు ఏర్పాటు చేయాలని అనంత్ శంకర్ తమ సిబ్బందికి సూచించారు.

వెల్‌షార్క్ తిరిగి సముద్రంలోకి..
దీంతో వెంటనే అటవీశాఖ సిబ్బంది, మత్స్యకారులు వేల్ షార్క్ కు ఫీల్టర్ ఫీడింగ్ ఇచ్చారు. అనంతరం ఈ రెండు టన్నుల షార్క్ ను సురక్షితంగా సముద్రంలోకి పంపారు. తమ ప్రయత్నాలు విజయవంతంగా పూర్తయ్యాయని .. వెల్ షార్క్ సముద్రంలో స్వేచ్ఛగా తిరుగుతోందని అటవీ అధికారులు తెలిపారు. మత్స్యకారులు ఇలాంటి భారీ చేపలు తీరానికి కొట్టుకు వచ్చినా.. వలకు చిక్కినా తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇలాంటి వాటిని సురక్షితంగా రక్షించి తిరిగి సముద్రంలోకి పంపించాలని కోరారు.

కృష్ణానదిలో వలకు చిక్కు భారీ టేకు చేప
కాగా గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ సమీపంలో భారీ టేకు చేప మత్స్యకారుల వలకు చిక్కింది. కృష్ణానదిలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు ఉట్టి వెంకటేశ్వర్లు, గంగరాజు, సాయికృష్ణలకు ఈ భారీ చేప దొరికింది. .. దీని బరువు సుమారు 200 కిలోలు ఉందని మత్స్యకారులు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications