మాటంటే మాటే.. చెప్పింది చేస్తాం.. విశాఖలో వైఎస్ఆర్ పెన్షన్ పథకంలో మంత్రి బొత్స
విశాఖపట్నం : టీడీపీని పరోక్షంగా టార్గెట్ చేస్తూ మంత్రి బొత్స సత్యనారాయణ చురకలు అంటించారు. గత ప్రభుత్వం మాదిరిగా తమ ప్రభుత్వం మాయమాటలు చెప్పబోదని స్పష్టం చేశారు. ఏది చెబుతామో అది చేస్తామని వెల్లడించారు. ఆచరణకు నోచుకోని హామీలు ఇవ్వబోమని.. ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కృషి చేస్తామని చెప్పుకొచ్చారు. ఇక సీఎం జగన్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తూ.. మాట తప్పని, మడమ తిప్పని నేతగా అభివర్ణించారు.
విశాఖలో వైఎస్ఆర్ పెన్షన్ పథకాన్ని మరో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభించారు బొత్స. పలువురు లబ్దిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి బొత్స.. విశాఖ వాసులకు మరిన్ని సౌకర్యాలు అందించేలా కృషి చేస్తామన్నారు.

Recommended Video

సెంట్రల్ పార్క్ ఏరియాలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు బొత్స. అలాగే విశాఖ సెంట్రల్ పార్క్‌గా చలామణీలో ఉన్నదాన్ని వైఎస్ఆర్ సెంట్రల్ పార్క్‌గా మార్చినట్లు చెప్పుకొచ్చారు. ఇక్కడ వైఎస్ఆర్ వర్ధంతి రోజైన సెప్టెంబర్ 2వ తేదీన ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. అందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదన్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications