• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

చిగురుటాకులా వణికిన విశాఖ: పార్కులనూ వదల్లేదు, కంటకుడు పార్ట్-7లో విజయసాయిరెడ్డి విసుర్లు

|
Google Oneindia TeluguNews

మాజీ సీఎం చంద్రబాబు బినామీల భూకబ్జాలతో విశాఖ జిల్లా బెంబేలెత్తిపోయిందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. విశాఖ కంటకుడు పార్-7 పేరుతో ఆయన ట్వీట్ చేశారు. చంద్రబాబు-లోకేశ్ పేరుతో.. తెలుగు తమ్ముళ్ల చేసిన అవినీతి ఇదీ అని విరుచుకుపడ్డారు. చంద్రబాబు అధికారంలో ఉన్న 14 ఏళ్లలో జరిగిన అక్రమాలను వివరించారు. గత హయాంలో దందాలు, సెటిల్‌మెంట్లతో విశాఖ జిల్లాను దోచేశారని ఫైరయ్యారు. సేవ్ విశాఖ పేరుతో తాము ఢిల్లీ వరకు ధర్నా చేశామని గుర్తుచేశారు. అప్పటి విశాఖ ఎంపీ హరిబాబు తప్ప బీజేపీ రాష్ట్ర నేతలు తమ ఆందోళనల్లో పాలుపంచుకున్నారని విజయసాయిరెడ్డి తెలిపారు.

భగవంతుడి దయ తోనే అంటూ.. Vijayasai Reddy ట్వీట్ || Oneindia Telugu
 అతిపెద్ద భూ స్కాంలు..

అతిపెద్ద భూ స్కాంలు..

దేశంలో అతిపెద్ద భూస్కాం విశాఖలోనే చేశారని మండిపడ్డారు. విశాఖలో ప్రజాసంకల్ప యాత్ర చేసే సమయంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు అన్నీ లోకేష్ గురించేనని పేర్కొన్నారు. వైఎస్‌ఆన్ హయాంలో ఐటీ సెజ్, సినీ స్టూడియో, పర్యాటక, అభివృద్ధి ప్రాజెక్టులతో అభివృద్ధి పథంలోకి వచ్చిందన్నారు. తర్వాత భీమిలి నియోజకవర్గంలో టీడీపీ నేతలు భూ కబ్జాలకు తెరలేపారని పేర్కొన్నారు. పురాతన మున్సిపాలిటీలో పట్టణ ప్రతిష్టను ఆక్రమణతో మసకబారి పోయిందన్నారు. భీమిలిలో 5 వేల ఎకరాలను టీడీపీ నేతలు అక్రమించారని సిట్ దర్యాప్తులో తేలిందని చెప్పారు.

ప్రభుత్వ పార్కు కబ్జా..

ప్రభుత్వ పార్కు కబ్జా..

సబ్బం హరి ఏకంగా ప్రభుత్వ పార్కునే కబ్జా చేశాడని సంచలన ఆరోపణలు చేశారు. అతను అప్పట్లో టీడీపీలో లేకున్నా.. పెదబాబు, చినబాబు ఆశీస్సులతో రెచ్చిపోయారని తెలిపారు. జిల్లాలో గల మండలాల్లో 533 ఎకరాల పేదల భూములను గతంలో ఒక టీడీపీ మంత్రి కబ్జా చేశాడని ఆరోపించారు. ఆ భూ కబ్జాల పురాణం గరుడ పురాణం కన్నా పెద్దదని స్థానిక టీడీపీ నేతలే చెబుతారని పేర్కొన్నారు. పెందుర్తి మండలం ముదపాలకలోని 955 ఎకరాల అసైన్డ్‌ భూములను టీడీపీ నేతలు కబ్జా చేశారని ఆరోపించారు.

బాబు బంధువులు కబ్జా..?

బాబు బంధువులు కబ్జా..?

రుషికొండలో వేల కోట్ల విలువ చేసే భూమిని చంద్రబాబు బంధువులు, ఎంవీవీఎస్‌ మూర్తి కుటుంబీకులు కబ్జా చేశారని స్థానికులే చెప్పుకుంటారని విజయసాయిరెడ్డి తెలిపారు. అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ రామవరం భూ కబ్జా కేసులో బుక్కయ్యాడని.. ఏకంగా 90 ఎకరాల దేవాదాయ భూముల్ని కొట్టేశాడని సిట్ కేసు నమోదు చేసిందని వివరించారు. జన్మభూమి కమిటీలో భూ కబ్జాల గురించి ఎంత చెప్పినా తక్కువేనని విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖలో ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడ గద్దల్లా వాలిపోయేవారనని విరుచుకుపడ్డారు.

నమ్మిన బంటులతో కబ్జాలు..


విశాఖ చుట్టుపక్కల మండలాల్లో ఎమ్మార్వో, ఆర్డీవో , సబ్ రిజిస్టార్లుగా నమ్మిన బంటుల్నే నియమించుకుని, ఆయా మండలాల్లో కబ్జాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. అప్పటి సిట్‌కు 3 వేల ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. ఫిర్యాదులు అన్నీ టీడీపీ నేతలపైనే వచ్చాయని తెలిపారు. లోకేశ్ పేరు రాకుండా చంద్రబాబు జాగ్రత్త పడ్డాడని ఆరోపించారు. చంద్రబాబు పాలనలో విశాఖలో చెలరేగిపోయిన తెలుగుదేశం నేతల కన్నా.. తెలంగాణలో నయీం చాలా బెటరని ప్రజలు చెప్పుకుంటున్నారని ఆరోపణలు చేశారు. హుద్ హుద్ తుపాన్‌ను విశాఖ తట్టుకుందని.. కానీ భూ బకాసురుల దందాలకు మాత్రం చివురుటాకులా వణికిపోయిందని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు.

English summary
ysrcp mp vijaya sai reddy slams chandra babu naidu on land mafia in vizag.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X