విశాఖపట్నంపై మళ్లీ పేల్చిన బుగ్గన రాజేంద్రనాథ్..!!
ఏపీకి ఏకైక రాజధానిగా విశాఖపట్నం ఉంటుందంటూ తాను చేసిన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదాన్ని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చల్లార్చే ప్రయత్నం చేశారు. తాజాగా వివరణ ఇచ్చారు
విశాఖపట్నం: ఏపీకి ఏకైక రాజధానిగా విశాఖపట్నం ఉంటుందంటూ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చేసిన వ్యాఖ్యలు తాజాగా కలకలం రేపుతున్నాయి. ఇప్పటివరకు మూడు రాజధానులు ఉంటాయని చెప్పుకొంటూ వస్తోన్న అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ- దీనికి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడు రాజధానులు ఉండవనేది బుగ్గన వ్యాఖ్యలతో స్పష్టమౌతోందని, ఇదంతా వైసీపీ ఆడుతున్న గేమ్ లో భాగమంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తోన్నాయి.

సజ్జలతో పాటు..
మూడు రాజధానుల ఏర్పాటుపై ఇవ్వాళ పలువురు మంత్రులు, వైసీపీ నాయకులు స్పందించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను సమంగా అభివృద్ధి చేయాలనేదే తమ ఉద్దేశమని ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పాలనను వికేంద్రీకరించడానికే తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మూడు రాజధానుల నినాదంతోనే ఎన్నికలకు వెళ్తామనీ స్పష్టంచేశారు.

అంబటి, ధర్మాన..
అటు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కూడా దీనిపై స్పందించారు. మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనేది తమ ప్రభుత్వ విధానమని తేల్చి చెప్పారు. దీనితోనే రాష్ట్రం సమతుల అభివృద్ధిని సాధిస్తుందని వ్యాఖ్యానించారు. గతంలో హైదరాబాద్ లో ఏం జరిగిందో అందరూ చూశారని గుర్తు చేశారు. అభివృద్ధి చెందిన హైదరాబాద్ ను రాష్ట్ర విభజన తరువాత వదులుకుని రావాల్సి వచ్చిందని, అలాంటి పొరపాటు మళ్లీ జరగకూడదని అన్నారు. అందుకే వైఎస్ జగన్ మూడు రాజధానులను ఏర్పాటు చేస్తారని పేర్కొన్నారు.

వెనక్కి వెళ్లం..
తాజాగా రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు సైతం ఈ అంశంపై మాట్లాడారు. గుంటూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధిని వికేంద్రీకరించడానికి ప్రభుత్వం మూడు రాజధానులను నిర్ణయించిందని, ఇందులో నుంచి వెనక్కి వెళ్లే ప్రసక్తే ఉండదని తేల్చి చెప్పారు. విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీ చేసిన సిఫారసులను కూడా అమలు చేస్తుందని ధర్మాన అన్నారు.

త్వరలో విశాఖ నుంచి..
ఈ పరిణామాలన్నింటిపైనా తాజాగా బుగ్గన స్పందించారు. త్వరలోనే విశాఖపట్నం నుంచి పరిపాలన కొనసాగించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర విభజన సమయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ చేసిన సిఫారసులను తాము అనుసరిస్తోన్నామని అన్నారు. ఈ కమిటీ చేసిన సిఫారసుల్లో ప్రధానమైనది.. అధికార వికేంద్రీకరణేనని గుర్తు చేశారు. అధికారాన్ని వికేంద్రీకరించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

ఎనిమిది రాష్ట్రాల్లో..
దేశంలో ఎనిమిది రాష్ట్రాల్లో అధికార వికేంద్రీకరణ అమలులో ఉందని బుగ్గన వ్యాఖ్యానించారు. రాష్ట్ర రాజధాని ఒకచోట ఉంటే- హైకోర్టు మరో చోట ఉంటోందని పేర్కొన్నారు. ఈ విషయంలో ఆయన కేరళ, ఉత్తర ప్రదేశ్.. వంటి రాష్ట్రాలను ఉదహరించారు. తమిళనాడులోని మధురై, మహారాష్ట్రలోని నాగ్ పూర్ లల్లో ఆయా రాష్ట్రాల హైకోర్టుల బెంచ్ లు ఏర్పాటయ్యాయని బుగ్గన చెప్పారు. అలాగే- కర్ణాటకలోని బెళగావిలో అక్కడి ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తుంటుందని గుర్తు చేశారు.
-
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications