దోస్తే దొంగ.. ఒకే రూములో ఉండి..! పెట్టాడుగా శఠగోపం..!!

విశాఖపట్నం : కలిసివుంటే కలదు సుఖం అనేది పాత మాట అని నిరూపించాడు ఓ దోస్త్. లేటెస్ట్ వెర్షన్‌లో తనదైన భాష్యం చెప్పాడు. కలిసివుంటే కలదు దొంగతనం అని నిరూపించాడు. ఫ్రెండే కదా అని ఒకే రూములో కలిసి ఉన్న పాపానికి శఠగోపం పెట్టాడు. కేవలం నాలుగు రోజుల్లో దాదాపు 80 వేల రూపాయలు కాజేశాడు. విశాఖపట్నంలో వెలుగుచూసిన ఈ ఘటన చర్చానీయాంశమైంది.

ఇసుకతోట ప్రాంతానికి చెందిన బొద్దు సాయి కిరణ్‌ అలియాస్‌ సాయి, చందక భాస్కరరావు స్నేహితులు. వారిద్దరూ కలిసి ఒకే రూములో ఉంటున్నారు. అయితే ఈజీ మనీ కోసం వెంపర్లాడుతున్న సాయి అడ్డదారులు తొక్కాడు. ఆ క్రమంలో స్నేహితుడు అని చూడకుండా భాస్కరరావు జేబుకు కన్నం పెట్టాడు.

v roommate stolen his friends cash via mobile app in visakhapatnam

ఓ సందర్భంలో కాల్ చేసుకుంటానంటూ భాస్కర్ రావు ఫోను తీసుకున్న సాయి అందులో మొబిక్విక్ యాప్‌లో తన మొబైల్ నెంబర్ సెట్ చేశాడు. ఇక అప్పటినుంచి తరచుగా భాస్కర్ రావు ఫోన్ తీసుకుంటూ ఈ నెల 7వ తేదీ నుంచి 11వ తేదీ లోపు దాదాపు 80 వేల రూపాయలు తన ఖాతాకు బదిలీ చేసుకున్నాడు. అయితే నగదు ట్రాన్స్‌ఫర్ సమయంలో వచ్చే ఓటీపీలను.. తన పని అయిపోగానే డిలీట్ చేసేవాడు. ఏమీ తెలియనట్లుగా భాస్కర్ రావుకు అతడి ఫోన్ తిరిగి ఇచ్చేవాడు.

ఇటీవల భాస్కరరావు ఫోనుకు ఎస్‌బీఐ బ్యాంకు నుంచి అలర్ట్ మేసేజ్ వచ్చింది. మీ ఖాతాను పీవోఎస్‌/ఈ కామర్స్‌ లావాదేవీలకు వాడుతున్నారు. ఒకవేళ మీరు కానట్లయితే వెంటనే కార్డును బ్లాక్‌ చేయించండి అనేది దాని సారాంశం. ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయడమే తప్ప ఎలాంటి ఇతర లావాదేవీలు చేయని భాస్కరరావుకు అనుమానం వచ్చింది. వెంటనే బ్యాంకు అధికారులను కలిసి వివరాలు అడిగారు. దాంతో వారు ఆయన ఖాతా చెక్ చేసి నాలుగు రోజుల్లో 80 వేలు విత్‌డ్రా చేసినట్లు తెలిపారు. దాంతో ఆయన సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. వారు రంగంలోకి దిగి అసలు దొంగ రూమ్‌మేట్ అని తేల్చారు. ఆ మేరకు సాయిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. అతడి బ్యాంకు ఖాతాను స్థంభింపజేసి మొబైల్ ఫోన్ స్వాధీనపరుచుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+