విజయనగరం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పంచాయతీ మొదటి విడత ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారుల గెలుపుకు కారణం ఇదే .. అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

ఏపీలో పంచాయతీ తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఫలితాలలో వైసిపి హవా కొనసాగింది. పంచాయతీ ఎన్నికలలో సత్తా చాటుతాం అనుకున్న టీడీపీ, పంచాయతీ ఎన్నికల్లో సైతం బోల్తా పడింది. కనీసం అమరావతి గ్రామాలలో కూడా టిడిపి పట్టు సాధించలేకపోయింది. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ వైసిపికి అనుకూలంగా రావడంపై టిడిపి నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.

టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు గెలవడానికి పోలీసులే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు.

జైలు నుండి విడుదలైన అచ్చెన్నాయుడు .. నిమ్మాడ పంచాయతీ పోలింగ్ వేళ కన్నీరు పెట్టుకున్న అచ్చెన్న.. ఆపై సవాల్జైలు నుండి విడుదలైన అచ్చెన్నాయుడు .. నిమ్మాడ పంచాయతీ పోలింగ్ వేళ కన్నీరు పెట్టుకున్న అచ్చెన్న.. ఆపై సవాల్

 తన రాజకీయ జీవితంలో ఇటువంటి ఎన్నికల చూడలేదని పేర్కొన్న అచ్చెన్నాయుడు

తన రాజకీయ జీవితంలో ఇటువంటి ఎన్నికల చూడలేదని పేర్కొన్న అచ్చెన్నాయుడు

ఇప్పటివరకు తన రాజకీయ జీవితంలో ఇటువంటి ఎన్నికల చూడలేదని పేర్కొన్న అచ్చెన్నాయుడు తన స్వగ్రామం నిమ్మాడలో ఎప్పుడూ ఎన్నిక ఏకగ్రీవం అని, అలాంటి చోట ఎన్నికలు జరిగాయని, అంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అని పేర్కొన్నారు. ఆడవాళ్ల ని కూడా చూడకుండా తన కుటుంబీకులపై పోలీసులు కేసులు నమోదు చేశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు వైసిపి బలపరిచిన అభ్యర్థులకు సహకరించారని, టిడిపి బలపరిచిన అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేశారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు .

బెదిరింపులతోనే తగ్గిన పోలింగ్ శాతం , మా ఫిర్యాదులు పట్టించుకోలేదు

బెదిరింపులతోనే తగ్గిన పోలింగ్ శాతం , మా ఫిర్యాదులు పట్టించుకోలేదు


90 శాతం పోలింగ్ జరిగే గ్రామాలలో కూడా పోలీసుల భయం కారణంగా పోలింగ్ శాతం తగ్గిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఓటర్లను, అభ్యర్థులను భయబ్రాంతులకు గురి చేసి వైసీపీ విజయం సాధించిందని చెప్పుకోవడం గొప్ప కాదన్నారు. ఎన్నికల్లో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఎన్నికల్లో అక్రమాలపై , బెదిరింపు పర్వాలపై రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవని మండిపడ్డారు .

పోలీసుల వల్లే వైసీపీ ఎన్నికల విజయం

పోలీసుల వల్లే వైసీపీ ఎన్నికల విజయం

అన్యాయంగా తనపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెట్టారన్న అచ్చెన్న , రాష్ట్ర వ్యాప్తంగా వై సీపీ నాయకుల అరాచకాలపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ప్రభుత్వం ఉద్యోగులను, పోలీస్ వ్యవస్థను వైసీపీ నాయకులు తమకు అనుకూలంగా వాడుకున్నారని , దాని ఫలితమే ఈ ఎన్నికల ఫలితాలని అచ్చెన్నాయుడు సంచలన ఆరోపణలు చేశారు . బెదిరించి , భయపెట్టి సాధించిన విజయం , విజయమే కాదన్నారు .

English summary
AP TDP president Atchannaidu made sensational comments over victory of the YCP supporters in panchayat elections . atchannaidu alleged that the police supported to ycp candidates and threaten the tdp supporters . the less polling percentage also one of the reason of YCP victory . YCP misuesd the power in the panchayat elections made the ycp supporters win .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X