పెళ్లి చేసుకోను : వ‌్య‌భిచారం చేసుకొని బ‌తుకు : లేకుంటే చావు..!

ఏపిలోని విజ‌య‌న‌గ‌రం జిల్లాలో మ‌హిళ‌ల పై హింస వెలుగులోకి వ‌చ్చింది. విన‌డానికే జుగుప్స క‌లిగించే విధంగా సాతున్న వేధింపులు వెలుగులోకి వ‌చ్చాయి. విజ‌య‌న‌గ‌రం కేంద్రంగా ఇద్ద‌రు బ‌ట్ట‌ల వ్యాపారం చేస్తున్న‌ట్లు న‌టించి ఆ మాటున వ్య‌భించారం సాగించారు. తాజాగా జ‌రిగిన ఓ ఘ‌ట‌న ద్వారా ఈ అకృత్యాలు వెలుగులోకి వ‌చ్చాయి. యువ‌తు ల‌తో వ్యాపారం చేసే ఓ వ్య‌క్తి చేతిలో మోసపోయ‌న యువ‌తి ఫిర్యాదు తో పోలీసులు మొత్తం వ్య‌వ‌హారాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ వ్య‌వ‌హారంలో జిల్లా మొత్తం ఉలిక్కి ప‌డింది.

స్థానిక లంకాపట్నానికి చెందిన ఆటోడ్రైవర్‌ బంగారు చక్రధర్‌కు లీల అనే యువతితో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. వీరిద్దరూ కలిసి పట్టణంలోని ఉడాకాలనీ, వి.టి.అగ్రహారం, పూల్‌బాగ్‌ తదితర ప్రాంతాల్లో వ్యభిచార గృహాలను గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. అద్దెకున్న ఇళ్ల వద్ద బట్టల వ్యాపారం చేస్తున్నట్లు నటించి, ఆ మాటున వ్యభిచారం యధేచ్చగా సాగించారు. బట్టల కోసం కోలకత్తా అప్పుడప్పుడు వీరిద్దరూ వెళ్లేవారు. అక్కడ పరిచయమైన ఓ యువ‌తిని తన వలలో వేసుకున్నాడు. వెళ్లి, వచ్చేటప్పుడల్లా తనతో ప్రేమాయణం సాగించేవాడు. అది ప్రేమగా మారి రోజూ ఫోన్లు చేసుకునేవారు, ఈలోగా తన పనిమీద ఆమె ఇటీవల శ్రీకాకుళం వచ్చింది.

Auto driver cheated a lady in Vizianagaram district...Threaten her for prostitution

చక్రధర్‌ కూడా శ్రీకాకుళం వెళ్లాడు. ఆమెను పెళ్లిచేసుకుంటానని చక్రధర్‌ నమ్మించాడు. ఆ మాటలు ఆ యువ‌తి నమ్మింది. మాయమాటలు చెప్పి విజయనగరంలోని ఉడాకాలనీలో గల ఒక ఇంటి వద్ద ఓ మహిళను తోడుగా యువ‌తి వ‌ద్ద‌ ఉంచాడు. శారీరకంగా ఆమె వద్ద సుఖాలనుభవిస్తూ ఆమెను గర్భవతిని చేశాడు. ఆమె పెళ్లిచేసుకోవాలని చక్రధర్‌పై ఎంతగా ఒత్తిడి తీసుకువచ్చినా ఫలితం లేకపోవడంతో తానెలా బతకాలని నిలదీసింది. దీనికి స్పంద‌న‌గా చ‌క్ర‌ధ‌ర్ దారుణ‌మైన స‌మాధానం ఇచ్చాడు. కావాలంటే వ్యభిచారం చేసుకుని బతకమన్నాడు. లేకుంటే చావ‌మ‌ని ఉచిత స‌ల‌హా ఇచ్చాడు. దీంతో..ఆ యువతి పోలీసుల‌ను ఆశ్ర‌యించింది.

ఆ యువ‌తి పిర్యాదుతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. స్పెషల్‌ బ్రాంచ్, వన్‌టౌన్‌ పోలీసులు తమదైన శైలిలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ప్రాంతాలకు వెళ్లి, రెడ్‌ హ్యాండెడ్‌గా వారిని అదుపులోకి తీసుకున్నారు. తన బతుకు బుగ్గిపాలైంద ని, ఎందరో బతుకులు తీసేస్తున్నాడని, తన బతుకు ఏమైనా పర్వాలేదు కానీ, మరే ఆడపిల్ల బతుకు పాడవ్వకూడదనే ఉద్దేశంతో నేరుగా జిల్లా ఎస్పీ జి.పాలరాజును ఈ నెల మూడో తేదీన కలిసి తనగోడు వెళ్లబుచ్చుకుంది. జిల్లా ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు విటుల్లా నటించి చక్రధర్‌కు ఫోన్‌ చేసి అమ్మాయిలు కావాలని ఎరవేశారు. అలా వలలో చిక్కిన చక్రధర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అందులో మైనర్‌ బాలిక ఉండడంతో పోక్సో చట్టం కింద ఒక కేసు, అమ్మాయిని మోసం చేసిన దానిమీద మరో కేసు, వ్యభిచారంకింద మరో కేసు నమోదైంది. పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ వ్య‌వ‌హారం తో ఇంకా ఎవ‌రికైనా లింకులు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచార‌ణ సాగిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+