సంచైత పయనమెటు ? తేలని మాన్సాస్ అక్రమాలు- వైసీపీ నుంచి లభించని హామీ

పూసపాటి రాజవంశీయులకు చెందిన మాన్సాస్ ట్రస్టులో అక్రమాల్ని వెలికితీస్తామని, హైకోర్టు ఆదేశాలతో తిరిగి పదవిలోకి వచ్చిన ఛైర్మన్ అశోక్ గజపతిరాజును జైలుకు పంపుతామని బీరాలు పలికిన వైసీపీ సర్కార్ తేలిపోయింది. మాన్సాస్ అక్రమాలపై నివేదిక అందిందని చెబుతూనే అందులో విషయాల్ని బయటపెట్టేందుకు జంకుతోంది. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మాజీ ఛైర్ పర్సన్ సంచైత గజపతిరాజు భవిష్యత్తు డైలమాలో పడుతోంది.

మాన్సాస్ లో వైసీపీ తేల్చిందేంటి ?

మాన్సాస్ లో వైసీపీ తేల్చిందేంటి ?

విజయనగరంలోని పూసపాటి రాజులకు చెందిన మాన్సాస్ ట్రస్టులో కొన్నేళ్లుగా అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు చేసిన వైసీపీ సర్కార్... హైకోర్టు తీర్పు వచ్చే వరకూ మౌనంగానే ఉంది. ఆ తర్వాత ఒక్కసారిగా అక్రమాలపై దర్యాప్తుకు ఆదేశాలు ఇచ్చింది. తాజాగా దేవాదాయశాఖ అధికారులు నిర్వహించిన ఈ దర్యాప్తు నివేదిక కూడా ప్రభుత్వానికి అందినట్లు తెలుస్తోంది. కానీ అక్రమాల్ని మాత్రం ప్రభుత్వం బయటపెట్టలేని పరిస్ధితుల్లో ఉన్నట్లు సమాచారం. ఈ ట్రస్ట్ స్వయంగా అశోక్ గజపతిరాజు పూర్వీకులకు చెందినది కావడం, ఇందులో అశోక్ అవినీతి చేశారని చెప్తే జనం స్పందన ఎలా ఉంటుందన్న భయాల మధ్య ఈ రిపోర్ట్ ను బయటపెట్టేందుకు వైసీపీ సర్కార్ ముందుకు రావడం లేదు.

సంచైత ఆశలు ఆవిరి

సంచైత ఆశలు ఆవిరి

మాన్సాస్ ట్రస్టులో తన బాబాయ్ అశోక్ గజపతిరాజు స్ధానంలో ఛైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన ఏడాదిన్నర తర్వాత హైకోర్టు తీర్పుతో పదవీచ్యుతురాలైన సంచైత గజపతిరాజు ఇప్పుడు మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. వైసీపీ సర్కార్ మద్దతు ఉన్నప్పటికీ మాన్సాస్ అక్రమాలపై ప్రభుత్వం ఏం తేల్చిందో చెప్పలేని పరిస్ధితుల్లో ఆమె ఉన్నారు. దీంతో సహజంగానే మాన్సాస్ ఛైర్ పర్సన పదవి తిరిగి తనకు లభిస్తుందని సంచైత పెట్టుకున్న ఆశలు కూడా ఆవిరైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఏమీ తేల్చకపోవడంతో తిరిగి తన స్వశక్తినే నమ్ముకునేందుకు ఆమె సిద్ధమవుతున్నారు.

 హైకోర్టు తుది తీర్పుపై సంచైత ఆశలు

హైకోర్టు తుది తీర్పుపై సంచైత ఆశలు

మాన్సాస్ ట్రస్టు ఛైర్ పర్సన్ గా సంచైత గజపతిరాజు నియామకాన్ని హైకోర్టు సింగిల్ బెంచ్ కొట్టేయడంతో ప్రభుత్వం, సంచైత చాలా కాలం పాటు మౌనంగా ఉండిపోయారు. చివరికి ఈ వ్యవహారం కాస్తా ప్రతిష్టాత్మకంగా మారడంతో హైకోర్టు డివిజన్ బెంచ్ లో సంచైతతో పాటు ప్రభుత్వం కూడా అప్పీల్ చేసింది. ఈ పిటిషన్లపై విచారణ జరగాల్సి ఉంది. దీంతో హైకోర్టు ఇచ్చే తుది తీర్పులోనైనా తనకు ఊరట దక్కుతుందని సంచైత ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. హైకోర్టులో ఊరట లభించకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సంచైత సిద్దమవుతున్నారు.

బీజేపీలో ఉండలేక, వైసీపీకి వెళ్లలేక

బీజేపీలో ఉండలేక, వైసీపీకి వెళ్లలేక

మాన్సాస్ ట్రస్టు ఛైర్ పర్సన్ పదవిలో వైసీపీ సర్కార్ నియమించగానే సొంత పార్టీ బీజేపీని కూడా కాదని వచ్చేసిన సంచైత గజపతిరాజుకు ఇప్పుడు హైకోర్టు తీర్పుతో ఏంం చేయాలో తెలియని పరిస్దితి నెలకొంది. తిరిగి బీజేపీకి వెళ్తే రానిచ్చే పరిస్ధితి లేకపోపడంతో వైసీపీవైపు ఆమె చూస్తున్నారు. కానీ వైసీపీ అధిష్టానం నుంచి కూడా సంచైతకు ఎలాంటి హామీ లభించడం లేదు. మధ్యలో మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మతో కలిసి ప్రెస్ మీట్ లో కనిపించిన సంచైత ఇప్పుడు ఆ వ్యవహారంతోనూ ఫలితం లేదని తేలిపోవడంతో తిరిగి ఎప్పటిలాగే బాబాయ్ అశోక్ పై విమర్శలకు దిగుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+