తాగాడు, తూలాడు.. పోలీసులకు చుక్కలు చూపించాడు..!

వరంగల్ : డ్రంకెన్ డ్రైవ్‌లో భాగంగా ట్రాఫిక్ పోలీసులకు తిప్పలు తప్పడం లేదు. ఫుల్లేసిన మందుబాబులు డ్యూటీలో ఉన్న పోలీసులకు సహకరించడం లేదు. అలాంటి ఘటనలకు సంబంధించి సోషల్ మీడియాలో లెక్కకు మించి వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఆ క్రమంలో హైదరాబాద్ మహా నగరంలో జరుగుతున్న డ్రంకెన్ డ్రైవ్ కేసులు కొన్ని సందర్భాల్లో నవ్వు తెప్పిస్తుంటే.. మరికొన్ని సందర్భాల్లో అయ్యో పాపం ట్రాఫికోళ్లు అనుకునే పరిస్థితి కనిపిస్తోంది.

అదలావుంటే వరంగల్ రూరల్ జిల్లాలో జరిగిన ఘటన చర్చానీయాంశమైంది. ఫూటుగా తాగిన ఓ మందుబాబు నడిరోడ్డుపై హల్‌చల్ చేశాడు. రాయపర్తి మండల కేంద్రంలో జరిగిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

A Person taken full of alcohol and create nuisance at main road in warangal district

డ్రంకెన్ డ్రైవ్‌లో భాగంగా అటువైపు వచ్చిన ద్విచక్ర వాహనదారుడిని పోలీసులు ఆపారు. నోట్లో పైపు పెట్టి ఊదమంటే అతడు మోతాదుకు మించి మందు తాగాడనే విషయం తెలిసింది. దాంతో సదరు వాహనదారుడి బైక్ అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తీరుతో మందుబాబు చిందులేశాడు. నా బైక్ తీసుకుంటారా అంటూ హంగామా చేశాడు. నడిరోడ్డుపై బైఠాయించడమే గాకుండా చొక్కా విప్పి అటూ ఇటూ తిరుగుతూ చుక్కలు చూపించాడు. ఆ ఒక్కడి వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చివరకు అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+