వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సమ్మక్కకు పుట్టింటి చీర సమర్పణ: నైవేద్యం సమర్పించిన తర్వాతే.. చంద వంశీయులు

|
Google Oneindia TeluguNews

వన దేవత సమ్మక్కకు పుట్టింటి చీరను చంద వంశీయులు సమర్పించారు. సంప్రదాయంలో భాగంగా అమ్మ ముందు చీరను ఉంచారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం బయ్యక్కపేట నుంచి మేళతాళాల నడుమ బయల్దేరి.. తమ ఆడ బిడ్డకు చీరను అందజేశారు. గ్రామంలోని ఆదివాసీలు ఇళ్లను శుభ్రం చేసుకుని పుణ్యస్నానాలు ఆచరించి కొత్త దుస్తులు ధరించారు. పురాతన సమ్మక్క గుడిని శుద్ధి చేసి అలుకు వేశారు.

ధూప దీప నైవేద్యం సమర్పణ

ధూప దీప నైవేద్యం సమర్పణ

ధూప, దీప నైవేద్యాలను సమర్పించి మొక్కుకున్నారు. పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, బెల్లం, పుట్టింటి చీర, వడి బాల బియ్యంతో బయల్దేరారు. జాతర పునరుద్ధరణ కమిటీ చైర్మన్‌ కోర్నిబెల్లి శివయ్య ఆధ్వర్యంలో వాటిని సమ్మక్క గద్దె వద్ద సమర్పించారు.

జంపన్న వాగుకు చేరనున్న నీరు మేడారం సమ్మక్క, సారలమ్మ భక్తుల పుణ్యస్నానాల కోసం ఎప్పటిలాగే లక్నవరం సరస్సు నుంచి నీటిని విడుదల చేశారు. ఈ జలాలు శనివారం జంపన్న వాగుకు చేరతాయి. ఈ నెల 21 వరకు నీటి విడుల కొనసాగుతుందని సాగు నీటి శాఖ అధికారులు తెలిపారు.

లక్నవరం సరస్సు సందర్శనకు నో..

లక్నవరం సరస్సు సందర్శనకు నో..

లక్నవరం సరస్సు సందర్శనను ములుగు జిల్లా యంత్రాంగం తాత్కాలికంగా నిలిపివేసింది. మేడారం జాతర నుంచి భక్తులు తిరుగు ప్రయాణంలో లక్నవరాన్ని సందర్శిస్తుంటారు. ఇరుకైన రోడ్లు, సరైన పార్కింగ్‌ వ్యవస్థ లేకపోవడం, పోలీసు యంత్రాంగం జాతర విధుల్లో ఉండడంతో ముందుజాగ్రత్తగా లక్నవరం దారిని మూసివేశారు.

గతంలో జాతరకు ఒకటి రెండు రోజుల ముందు ఇలా చేసే అధికారులు ఈసారి ఆరు రోజుల ముందే దారిని మూసివేశారు. ఇరుకు రోడ్లు, సరస్సు ఉండడంతో భక్తులను నియంత్రించడం కష్టమని భావించి రామప్ప దేవాలయ సందర్శనను కూడా తాత్కాలికంగా నిలిపివేయాలని అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది.

 ప్రత్యేక ఆహ్వాన పత్రిక

ప్రత్యేక ఆహ్వాన పత్రిక

మేడారం మహా జాతరకు ప్రముఖులను ఆహ్వానించేందుకు గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ఆహ్వాన పత్రికను రూపొందించింది. గిరిజన కళలు, హస్తకళల బహుమతులతో సిద్ధం చేసింది. ప్రత్యేక గిఫ్ట్‌ బాక్స్‌తో ఆహ్వాన పత్రికను ముస్తాబు చేశారు. ఇందులో కాఫీ టేబుల్‌ బుక్‌, కోయ/ గోండు పెయింటింగ్స్‌, నాయకపు గిరిజన దారు శిల్పాలు, ఓజా గోండ్‌ క్రాఫ్ట్స్‌, బంజారా క్రాఫ్ట్స్‌, సమాచార స్టిక్కర్లు ఉన్నాయి.

ఈ నెల 16వ తేదీ నుంచి సమ్మక్క సారాలమ్మ జాతర ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే సీఎంలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, జాతీయ, రాష్ట్రస్థాయి ప్రముఖులకు ఇప్పటికే గిరిజన సంక్షేమ శాఖ వీటిని అందజేసింది.

English summary
Chanda clans give sarry to lord sammakka. this month 16th onwards sammakka saralamma festival started.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X