అధికారంలోకి వస్తే లక్ష్యాలు నెరవేరుస్తాం.. టీఆర్ఎస్‌పై భట్టి విక్రమార్క విసుర్లు
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సభ తొలిమెట్టు అని భట్టి విక్రమార్క అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే, రైతులకు ఎలాంటి కష్టాలు ఉండవని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ తెచ్చిన తెలంగాణలో వ్యవసాయాన్ని, రైతాంగ సోదరుల్ని టీఆర్ఎస్ పార్టీ ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో వడ్డీలేని రుణాలు, పావలా వడ్డీకే మూడు లక్షల వరకు రుణాలు, సబ్సిడీకి ట్రాక్టర్లు, వ్యవసాయ పనిమూట్లు, మద్దతు ధరతో ధాన్యం ఇచ్చామని గుర్తు చేశారు.

టీఆర్ఎస్ రైతు బంధు పథకం తీసుకొచ్చి, ఆ స్కీమ్స్ నిలిపివేసిందని చెప్పారు. వ్యవసాయ రంగం, బలహీన వర్గాల్ని, పాడుభూమి వ్యవసాయం చేసుకునే గిరిజనుల్ని రక్షించడానికి.. రాహుల్ గాంధీ వ్యవసాయ డిక్లరేషన్ ప్రకటించారు. తాము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పెండింగ్‌లో ఉన్న లక్ష్యాలన్నీ తప్పకుండా నెరవేరుతాయని హామీ ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ ముందు ఎన్నో లక్ష్యాలు ఉండేవని, నదుల నీళ్ళు పంట పొలాలకు పారుతాయని, రైతాంగ సోదరులు ఆత్మగౌరవంతో బతుకుతారని, సంపదంతా ప్రజలకు దక్కుతుందని సోనియా గాంధీ ఆశించారన్నారు.
ఎనిమిదేళ్ళయినా కృష్ణా నదిపై గానీ, గోదావరి నదిపై గానీ టీఆర్ఎస్ ఒక్క ప్రాజెక్ట్‌ని కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. పది లక్షల కోట్లు ఖర్చయ్యింది కానీ, ఒక్క ఎకరానికి నీళ్ళు అందలేదన్నారు. ఆ లక్ష్యాల్ని నెరవేర్చడానికే రాహుల్ గాంధీ నేనున్నానంటూ వచ్చారన్నారు. భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ అని నేతలు అన్నారు. రైతు సంఘర్షణ సభ ద్వారా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీలు రైతులను మోసం చేస్తున్నాయని విమర్శించారు
-
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications