ఓరయ్యా ఇదేంది..? కేసీఆర్ భర్త అయ్యిండట.. నోరుజారిన ఎమ్మెల్యే.. (వీడియో)

అప్పుడప్పుడు కొందరు నేతల తీరు కాంట్రవర్సీ అవుతోంది. వాళ్లు క్యాజువల్‌గా మాట్లాడిన అంతే.. కానీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. వార్తల్లో నిలుస్తున్నారు. మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యే రాజయ్య తీరు కూడా ఇలానే ఉంది. ఆయన నోటి దూలను మరోసారి బయటపెట్టాడు. కేసీఆర్ మీద ఉన్న గౌరవమో.. లేదంటే ఇంకొటో తెలియడం లేదు.. కానీ చిత్ర, విచిత్రంగా కామెంట్ చేస్తున్నారు. బతుకమ్మ చీరల పంపిణీ వేళ తన నోటిదూలను ప్రదర్శించారు.

కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్

కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్

ఎమ్మెల్యే రాజయ్య అంటేనే కాంట్రవర్సీ.. డిప్యూటీ సీఎం పదవీని అర్ధాంతరంగా తీసివేయడానికి గల కారణం ఏంటో ప్రభువులకే తెలుసు.. ఆ తర్వాత పదవీ కోసం కాళ్ల వేళ్ల పట్టుకునే పరిస్థితి.. అయినా మంత్రి పదవీ కూడా రాలేదు. ఆ మధ్యన రాజయ్య- మహిళతో ఫోన్ కాల్ దుమారం రేపింది. ఫోన్‌లోనే రాసలీలల బాగోతం వెలుగుచూసింది. ఇప్పుడు మరోసారి కాంట్రవర్సీ తెరలేపారు. తన నోటి దూలను మరోసారి బయటపెట్టాడు.

 బతుకమ్మ చీరలు

బతుకమ్మ చీరలు

ఏటా బతుకమ్మ చీరలను ప్రభుత్వం పంపిణీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సారి కూడా చీరలను అందజేస్తున్నారు. అయితే ప్రభుత్వ పథకాలను ప్రస్తావించారు. అలాగే కొత్త చీరలను అవ్వ అయ్యా కొనివ్వడం లేదు.. అత్త మామ ఇవ్వడం లేదన్నారు. అందుకే వారికి కేసీఆర్ అవ్వ అయ్యా అవుతుండు.. అత్త మామ కూడా అవుతున్నాడని కామెంట్ చేశారు. ఇప్పటివరకు ఓకే.. కానీ కేసీఆర్ భర్త కూడా అవుతున్నాడని నోరు జారారు. సీఎం కేసీఆర్ భర్త అవడం ఏంటో.. ఆ ప్రజా ప్రతినిధికే తెలియాల్సి ఉంది.

పదవీలో ఉండి

అదేదో సినిమాలో కామెడీ బిట్‌లా మారింది వ్యవహారం.. బాధ్యతాయుతమైన పదవీలో ఉండి.. ఇలా నోరుజారడం కరెక్టు కాదు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై హై కమాండ్ స్పందించాలని అప్పుడే కోరుతున్నారు. రాజయ్య తోలు మందం వ్యాఖ్యలను సహించబోమని అంటున్నారు. దీనిపై హై కమాండ్ రియాక్ట్ కావాల్సి ఉంది. తగిన చర్యలు తీసుకోవాలని అందరూ కోరుతున్నారు.

అన్న నుంచి ఇలా..

అన్న నుంచి ఇలా..

బతుకమ్మ చీరల పంపిణీని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఏటా అందు కోసం నిధులను కేటాయిస్తోంది. పెద్దలకు కేసీఆర్ అన్న అయ్యిండు.. తోబుట్టువులా మారాడు అని కామెంట్ చేసేవారు. కానీ రాజయ్య మాత్రం ఏకంగా భర్త అయ్యిందని నోరు జారారు. అలా ప్లో లో వెళ్లిందో.. లేదంటే కావాలనే అన్నారో తెలియదు కానీ.. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.

తనకు పదవీ ఇవ్వడం లేదనే అక్కసుతో కేసీఆర్‌ పేరు ప్రస్తావించి ఇలా కామెంట్ చేశారని అనేవారు కూడా లేకపోలేదు. కానీ రాజయ్య తీరు మాత్రం క్షమించరానీది.. చదువు, సంధ్య లేనివాడో.. కూలీ నాలీ చేసుకునే వాడో అయితే తెలియదు.. కానీ డిప్యూటీ సీఎం పదవీ చేపట్టి.. ఎమ్మెల్యేగా ఉండి ఇలా దిగజారేలా మాట్లాడటం తెలంగాణ సమాజం క్షమించదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+